Congress President Poll: ముగిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. 19న ఫలితాలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తొందరలోనే రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుండడంపై పార్టీ నేతల్లో అనేక ఆశలు నెలకొన్నాయి

Congress President Poll: ముగిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. 19న ఫలితాలు

Polling concludes for Congress presidential election

Congress President Poll: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 9,000 మంది ఓటేయడానికి ఇందుకు అర్హులు. సోమవారం ఉదయమే ప్రారంభమైన ఈ పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నిక ఫలితాలు అక్టోబర్ 19న విడుదల కానున్నాయి. అయితే ఓటింగ్ ఎంత నమోదైందని మాత్రం పార్టీ పోలింగ్ కమిటీ వెల్లడించలేదు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తొందరలోనే రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుండడంపై పార్టీ నేతల్లో అనేక ఆశలు నెలకొన్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు వైపు నడిపించే నాయకత్వం కావాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. సోనియాతో పాటు ప్రియాంక గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. ఇక కీలక నేత రాహుల్ గాంధీ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సోనియా మాట్లాడుతూ.. ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూశానని పేర్కొన్నారు.

PUNE: అప్పు కింద మద్యం ఇవ్వలేదని పదునైన ఆయుధాలతో బార్ యజమానిపై దాడి