PUNE: అప్పు కింద మద్యం ఇవ్వలేదని పదునైన ఆయుధాలతో బార్ యజమానిపై దాడి
నర్హేలో ఉన్న లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్‌కు గురువారం కొంత మంది వచ్చి అప్పుగా మద్యం అడిగారు. అందుకు యజమాని గురన్న ఒప్పుకోలేదు. దీంతో శుక్రవారం ఏడుగురు వ్యక్తులు అదే బార్‌కు వచ్చి మళ్లీ అప్పుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వనని మళ్లీ అదే సమాధానం చెప్పడంతో దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Bar owner attacked in Pune for not serving liquor on credit
PUNE: అప్పు కింద మద్యం ఇవ్వలేదన్న కారణంతో ఒక బార్ యజమానిపై కొంత మంది దాడికి దిగారు. పదునైన ఆయుధాలతో యజమానిపై దాడి చేయడమే కాకుండా షాపులోని కంప్యూటర్ ధ్వంసం చేశారు. వారికి అడ్డు రాబోయిన బార్ వర్కర్లను బెదిరించారు. బార్లో ఉన్నవారిని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరారు. పూణెలోని నర్హే అనే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగిందీ ఘటన. బార్ యజమాని పేరు గురన్న తవర్కేడ్ (40). ప్రస్తుతం ఈయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయమై సిన్హాగడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్హేలో ఉన్న లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్‌కు గురువారం కొంత మంది వచ్చి అప్పుగా మద్యం అడిగారు. అందుకు యజమాని గురన్న ఒప్పుకోలేదు. దీంతో శుక్రవారం ఏడుగురు వ్యక్తులు అదే బార్‌కు వచ్చి మళ్లీ అప్పుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వనని మళ్లీ అదే సమాధానం చెప్పడంతో దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గురన్న ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 504 (శాంతిని చెడగొట్టి సమస్యలు సృష్టించే విధమైన వైఖరితో ప్రవర్తించడం), సెక్షన్ 506 (నేరపూరిత చర్యలకు పాల్పడడం) లాంటి చట్టాల కింద కేసు నమోదు చేశారు.