10TV Global Footprints : హైదరాబాద్ ఎయిర్ కార్గోకు ప్రశంసలు.. ఎగుమతులు, దిగుమతుల్లో సరికొత్త రికార్డు
10TV Global Footprints : ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడం కస్టమ్స్ విభాగం బాధ్యతగా భావిస్తామని, అయితే హైదరాబాద్‌లో 10TV వంటి మీడియా సంస్థ ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
- Sreehari A
- Updated on- August 15, 2026 / 10:38 PM IST
Puttapu Satish IRS Officer
10TV Global Footprints : 10టీవీ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ అధికారి అడిషనల్ కమిషనర్, కస్టమ్స్ కమిషనరేట్ హైదరాబాద్ జోన్ పట్టపు సతీశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎయిర్ కార్గో కేంద్రంగా ఎగుమతులు, దిగుమతుల రంగంలో జరుగుతున్న పురోగతి అభినందనీయమని అన్నారు. ఎగుమతిదారులు, దిగుమతిదారులను ప్రోత్సహించేందుకు మీడియా సంస్థలు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
“ఎగుమతులు అంటే కేవలం వస్తువులు, సేవల రవాణా మాత్రమే కాదు. అవి దేశ పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను, పారిశ్రామికవేత్తల సత్తాను ప్రతిబింబిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థాయిని బలోపేతం చేయడంలో ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయి” అని పట్టపు సతీశ్ తెలిపారు.
ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడం కస్టమ్స్ విభాగం బాధ్యతగా భావిస్తామని, అయితే హైదరాబాద్‌లో 10TV వంటి మీడియా సంస్థ ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Read Also : 10TV Global Footprints : ఎగుమతిదారులే దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముక! అడిషనల్ డీజీఎఫ్‌టీ సంపత్
తాను గతంలో ముంబైలో పనిచేశానని గుర్తుచేసుకున్న ఆయన.. హైదరాబాద్‌లో తెలుగు ప్రజల్లో కనిపిస్తున్న వ్యాపార చొరవ, ఉత్సాహం తనను ఆకట్టుకుందని చెప్పారు. ఎగుమతులు, దిగుమతుల రంగంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు.
వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో పాటు ఎగుమతిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కస్టమ్స్, వాణిజ్య విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని పట్టపు సతీశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎగుమతులు మరింత పెరిగి, ప్రపంచ మార్కెట్లలో భారత ఉత్పత్తులకు గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.
