10TV Global Footprints : ఐటీ మాత్రమే కాదు.. ఫార్మా, డిఫెన్స్‌లోనూ తెలంగాణ టాప్!
10TV Global Footprints : ఐటీలో ఎగుమతుల పరంగా కర్ణాటక తర్వాత తెలంగాణలో టాప్ లీడ్ లో ఉందన్నారు. అలాగే మన రాష్ట్రంలో ఫార్మా రంగంలో ఎక్స్ పోర్టర్స్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయని చెప్పారు.
- Sreehari A
- Updated on- August 20, 2026 / 04:20 PM IST
10TV Global Footprints Sridhar Babu
10TV Global Footprints : 10టీవీ గ్లోబల్ ఫుట్‌ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 10టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ దేశంలో తన ప్రత్యేక స్థానాన్ని చాటుకుంటోందని శ్రీధర్ బాబు అన్నారు. ఐటీ ఎగుమతుల్లో కర్ణాటక తర్వాత తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపారు. అదే విధంగా, ఫార్మాస్యూటికల్ రంగంలో దేశంలోనే తెలంగాణ ప్రముఖ ఎగుమతిదారుగా, అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
కేవలం ఐటీ, ఫార్మా రంగాలకే పరిమితం కాకుండా డిఫెన్స్ ఎగుమతుల్లోనూ తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. ఉత్పత్తులు, సేవలు సహా వివిధ రంగాల్లో తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటుకుంటూ దేశ, అంతర్జాతీయ స్థాయిలో ముందంజలో కొనసాగుతోందని తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రంగంలోనూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి గర్వించదగ్గ విషయమని శ్రీధర్ బాబు అన్నారు. ఐటీతో పాటు ఫార్మా, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లోనూ ఎగుమతులను పెంచుకుంటూ ప్రపంచ మార్కెట్‌లో తెలంగాణ తనదైన ముద్ర వేస్తోందని ఆయన పేర్కొన్నారు.
