Suma Kanakala : సినిమాలో కొడుకు ముద్దు సీన్స్ చూసి.. కొట్టడానికి చీపురుతో వచ్చిన సుమ..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ, రోషన్ కలిసి ఓ వీడియో చేశారు.

Suma Kanakala : యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) బబుల్‌గమ్(Bubblegum) సినిమాతో డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ, రోషన్ కలిసి ఓ వీడియో చేశారు.

ఇందులో రోషన్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ చూస్తుండగా వచ్చిన సుమ ఆ గోవా సాంగ్ చూసి అందులో హీరోయిన్ తో హీరో ముద్దులు పెట్టడం చూసి షాక్ అయి రోషన్ ని కొట్టడానికి చీపురు తీసుకొస్తుంది. ఈ వీడియో సరదాగా చేశారు సుమ, రోషన్. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు