వినాయకుడు..శివుడు, పార్వతిల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచినా పలుకుతాడన నమ్మకం. మొత్తం 32 రకాల పేర్లతో పలుస్తుంటారు. సుముఖ, కపిల, గజకర్ణ, లంబోదర, వికాత్, బాల గణపతి, భక్తి గణపతి, ధుంధి గణపతి, దుర్గా గణపతి, ద్విజ గణపతి, ద్విముఖ గణపతి, ఏకదంత గణపతి, ఏకాక్షర గణపతి, హరిద్ర గణపతి, హీరాంబ గణపతి, క్షిప్ర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, లక్ష్మీ గణపతి, మహా గణపతి, నృత్య గణపతి ఇలాంటి ఎన్నో పేర్లతో కొలుస్తుంటారు.
గణేషుడు రూపం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఏనుగు తల ఉన్న ఈ వినాయకుడు తెల్లనైన శరీరం గల వాడు. వినాయక చవితి రోజున..ఎంతో భక్తితో వేడుకలు జరుపుకుంటుంటారు. కానీ..గణేషుడి రూపం గురించి..ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఏ పూజ చేసినా…మొదటి పూజ చేసేది వినాయకుడికే. విఘ్నాలు తొలగాలని పూజిస్తుంటారు. ఆయన ధ్యానం చేయకుండా..ఏ దేవుడిని కొలిచినా ఫలితం శూన్యమంటారు పెద్దలు.
అసలు వినాయకుడి జన్మ రహస్యం ఏంటీ ? వినాయక చవితి పండుగ వస్తుందనగానే..పిల్లలతో పాటు పెద్దల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంటుంది. ఆయన రూపు రేఖల్లో ఎన్నో రహస్యాలున్నాయి.
గజాసురుడిని చంపిన అనంతరం…శివుడు కైలాసం వస్తుంటాడు. అదే సమయంలో పార్వతి స్నానం చేయడానిక వెళుతుంటుంది. నలుగు పిండితో స్నానం చేయబోతూ..అదే పిండితో…ఓ బొమ్మను చేసి..ప్రాణం పోయడంతో చిన్న బాలుడిగా మారుతాడు. ఎవరినీ లోపలకు రానివ్వద్దని..చిన్న బాలుడికి చెబుతుంది. కాసేపట్లో..అక్కడకు శివుడు వస్తాడు.
లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. బాలుడు అడ్డుకుంటాడు. శివుడికి తీవ్ర ఆగ్రహం వస్తుంది. త్రిశూలంతో బాలుడి తలను వధిస్తాడు. బయటకు వచ్చిన పార్వతి…ఇది చూసి రోదిస్తుంది. ఎలాగైనా బతికించాలని కోరుతుంది. రోదిస్తున్న పార్వతిని చూసి చలించిన శివుడు..ముఖాన్ని తెమ్మని చెబుతాడు. వారు తిరిగి తిరిగి..ఓ అడవిలో పడి ఉన్న ఏనుగు ముఖాన్ని తీసుకొస్తారు. ఇదే ముఖాన్ని బాలుడికి అతికిస్తాడు శివుడు.
అయితే..ఇతని శరీర భాగాల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి. ఏనుగు శరీరం అంటే..ఒక మెటీరియల్ అంటారు. పదార్థం నుంచే సృష్టి జరుగుతుంటుందనే విషయం తెలిసిందే.
గణేషుడి రూపం నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
గణేషుడి తల : తెలివికి, బుద్ధికి సింబల్ అంటారు. తెలివితేటలను చూపిస్తుంది. వినాయకుడిలాగా పెద్ద తలకాయ ఉన్న వారిలో తెలివితేటలు ఉంటాయంటుంటారు. ఏనుగు తలను అర్థం చేసుకుంటే…గణపతిలోని లక్షణాలు అర్థమౌతాయి. శరీరంతో పాటు బుద్ధిని సమప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది.
చెవులు : పెద్దవిగా ఉంటాయి. ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించాలని సూచిస్తుంటాయి. అవతలి వ్యక్తి పూర్తిగా మాట్లాడిన తర్వాతే..ఓ నిర్ణయానికి రావాలని చెబుతుంటాయి. ఎక్కువగా విని…తక్కువగా మాట్లాడాలనే సూత్రం చెబుతుంది.
చిన్న కళ్లు : శ్రద్ధ, ఏకాగ్రత చూపిస్తుంది. ఏ విషయాన్ని అయినా..సరే లోతుగా చూడడం చాలా అవసరం.
తొండం : ఓం గుర్తును చూపించేలా ఉంటుంది. తొండం ఎడమవైపున తిరిగి ఉంటే..ఆయన్ను వామముఖ గణేషుడు అంటారు. సహనం, ప్రశాతంత, ఓర్పును అందిస్తాయి. చంద్రుడు శక్తిని ఎడమవైపుకు వెళుతుందని పండితులు అంటుంటారు. తొండం కుడివైపున ఉంటే..ఆయన్ను దక్షిణాభిముఖ గణపతిగా పిలుస్తారు. మోక్షాన్ని, బుద్ధిని అందిస్తుందని అంటారు.
చేతులు : హిందూతత్వానికి ప్రతీక భావిస్తారు. ఒక చేతిలో పద్మం (సత్యం, జ్ఞానం, సౌందర్యం) రెండో చేతిలో గొడ్డలి (నమ్మకాలు బంధాలకు అతీతుడు), మూడో చేతిలో స్వీటు, లడ్డూ (జ్ఞానంతో వచ్చే సంతోషం) చూపిస్తుంది. నాలుగో చేయి అభయ ముద్ర (వరాన్ని ఇవ్వడం, ఆందోళన చెందవద్దని, తాను ఉన్నానని) అర్థం వస్తుంది.
దంతాలు : రెండు దంతాలు జ్ఞానం, భావోద్వేగాలను సూచిస్తాయి. కుడి దంతం జ్ఞానాన్ని, ఎడమ దంతం భావోద్వేగాన్ని సూచిస్తాయి.
పెద్ద బొజ్జ : పండిన వడ్లను పోసేందుకు ఉపయోగంచే గాదెకు గుర్తు అంటుంటారు.
ఎలుక వాహనం : ఎలుకను వాహనంగా ఉపయోగిస్తాడు వినాయకుడు. పంటలను పాడు చేసే వాటిని అణిచివేయడం సూచిస్తుంది.
‘‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే…, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం..అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే…,వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ..నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా…, మూషికవాహన మోదకహస్త..చామరకర్ణ విలంబిత సూత్ర…,
వామనరూప మహేశ్వరపుత్ర..విఘ్న వినాయక పాద నమస్తే…, గజాననం భూతగణాదిసేవితం…, కపిత్త జంబూఫల సారభక్షితం..ఉమాసుతం శోకవినాశ కారణం…, నమామి విఘ్నేశ్వర పాద పంకజం..సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణిక…, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః..ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః…, వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః’’..