పచ్చిమిర్చికి షుగర్, కొలెస్ట్రాల్‌లకు సంబంధమేంటి!

మిర్చి అంటేనే సపరేట్ ఫ్లేవర్. తింటే ఘాటు అయినా వంటల్లో తప్పని అలవాటు. రుచి కోసం మిర్చి తినడమే కాదు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగవడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

* రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ సమస్యని దూరం చేస్తాయి. దీంతో రెగ్యూలర్‌గా తింటే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

* మిర్చి తినడంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి రక్తంలో డయాబెటిస్ లెవెల్స్ 60శాతానికి తగ్గుతాయి. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఆహారంలో మిర్చిని తీసుకోవడం మంచిది.

* పచ్చిమిర్చిలో క్యాప్‌సైసిన్ అధికంగా ఉండడంతో శరీరపు మెటబాలిజాన్ని పెంచుతుంది. తెలుపు, గోధుమ రంగు రకాల కొవ్వులు రెండూ తగ్గుతాయి. మెటబాలిజం రేటు పెరిగి ఎటువంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారు.

* కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు కూడా పోతాయి. ఎలా అంటే మిరప గింజలను నువ్వుల నూనెలో వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మర్దన చేసే నొప్పులు పోతాయి.

* గొంతునొప్పి పోవాలంటే గ్లాసు నీటిలో గులాబీ పూలు కొన్ని పచ్చిమిర్చి నీటితో పుక్కిలించాలి.

* పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ నుంచి రక్షణగా ఉంటాయి.

* ప్రోస్టెట్ గ్రంథి సమస్యలకూ పచ్చిమిర్చి మందులా పనిచేస్తుంది.