కరోనా భయాల మధ్య మంచి వార్త. ఇండియాలో 13మందికి కరోనా నయమైంది, ఎయిడ్స్ మందులతో చికిత్స

  • Publish Date - March 17, 2020 / 10:18 AM IST

కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భయాల మధ్య సంతోషకరమైన విషయం. రాజస్థాన్, జైపూర్ నుంచి ఓ మంచి వార్త అందుతోంది. ఇక్కడ నలుగురు పేషెంట్లలో ముగ్గురికి కరోనా క్యూర్ అయ్యింది. ట్రీట్మెంట్ ఏంటో తెలియదుకదా? మరి ఎలా జైపూర్ డాక్టర్లు కరోనాను క్యూర్ చేశారు? కరోనాకు ఇంతకు ముందొచ్చిన వైరల్ వ్యాధులకు వాడిన మందుల కాంబినేషన్ అంటే Malaria, Swine Flu, HIV positiveకు వాడిన మందులనే డాక్టర్లు వాడారు.

కరోనాను జయించారు. ఈ ఘనతను ప్రభుత్వ Sawai Mansingh Hospital డాక్టర్లు సాధించారు. కరోనా నుంచి కోలుకున్న ముగ్గురికి పరీక్ష చేశారు. నెగిటీవ్ రిపోర్ట్ వచ్చింది. వాళ్లలో ఇటాలియన్ దంపతులు, దుబాయ్ నుంచి తిరిగివచ్చిన 85 ఏళ్ళ జైపూర్ వాసి. ఈయనకి, 69 ఏళ్ల ఇటాలియన్ కి రెండుసార్లు టెస్ట్ చేశారు. నెగిటీవ్ వచ్చింది.

ఇటాలియన్ భార్యకు అంతకుముందే నెగిటీవ్ వచ్చింది. వీళ్లకు ప్రభుత్వ వైద్యులే చికిత్స చేశారు. కోలుకున్నా, ముగ్గురిని డిస్చార్జ్ చేయలేదు. ఇంకా హాస్పటల్స్ లోనే ఉన్నారు. ఇద్దరు ఇక్కడే ఉండగా, ఇటాలియన్ మహిళను University of Medical Sciences (RUHS)కి షిప్ట్ చేశారు.

జైపూర్ లో మొత్తం నలుగురికి పాజిటీవ్ వచ్చింది. ముగ్గురికి వైరస్ తగ్గినట్లే. 24 ఏళ్ల నాలుగో వ్యక్తికి శనివారమే పాజిటీవ్ వచ్చింది. చికిత్సకు అతను చురుగ్గా స్పందిస్తున్నాడని, అతనికీ కరోనాను వదిలించగలమన్న నమ్మకం జైపూర్ వైద్యులది. మొత్తం మీద ఇప్పటివరకు ఇండియాలో 13మందికి కరోనా క్యూర్ అయ్యింది. వైరస్ బాధితుల్లో ఆశలను పెంచింది.
See Also | వృద్ధులకు కరోనా ట్రీట్‌మెంట్ చెయ్యరట