Not Losing Weight : ఎంత డైట్ చేసినా ఫలితం లేదా? మీరు బరువు తగ్గకపోవడానికి 5 కారణాలివే..!

Not Losing Weight : బరువు తగ్గించే డైట్‌ని ఫాలో అవుతున్నారా? అయినా బరువు తగ్గడం లేదా? అయితే, మీరు చేస్తున్న ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Not Losing Weight : బరువు తగ్గడం అంటే ఎంత కష్టమే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకసారి బరువు పెరిగారంటే అది కరిగించుకునేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. చాలామంది తిండి తగ్గించి బరువు తగ్గాలనుకుంటారు. తిన్నదానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలని తెగ ట్రై చేస్తుంటారు. అయితే, బరువును తగ్గించుకునే క్రమంలో ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. కఠినమైన ఆహారం లేదా వ్యాయామాలను చేయడం కూడా కొన్నిసార్లు బెడిసికొడతాయి.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

మీ హార్మోన్లు, జీవక్రియ, ఒత్తిడి స్థాయిలు, నిద్ర నాణ్యత వంటివి శరీర బరువును ప్రభావితం చేసే కొన్ని అంశాలుగా చెప్పవచ్చు. మీరు బరువు తగ్గించే డైట్‌ని పాటిస్తున్నప్పటికీ ఇంకా ఆశించిన ఫలితాలను పొందకపోతే, మీరు పరిగణించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడానికి కొన్ని కారణాలను వివరించారు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

1. తగినంత ప్రోటీన్ అందకపోవడం :
బరువు నిర్వహణలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువసేపు కడుపునిండినట్టు భావన కలిగిస్తుంది. దెబ్బతిన్న కండరాలు బాగుపడటం, జీవక్రియకు కూడా ప్రోటీన్ చాలా కీలకం. పోషకాహార నిపుణుడి ప్రకారం.. తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల క్యాలరీలను రోజుకు 80 నుంచి 100 కేలరీలు పెంచుతుంది. కాయధాన్యాలు, చిక్‌పీస్, టోఫు, గుడ్లు, క్వినోవా వంటి ప్రోటీన్ కలిగిన పదార్థాలను ఆహారంలో చేర్చుకోండి.

2. తగినంత ఆహారం తినకపోవడం :
చాలామంది తరచుగా బరువు తగ్గడానికి క్యాలరీలను బాగా తగ్గిస్తారు. తక్కువ కాలరీలను కలిగిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల జీవక్రియ 23శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల, నాణ్యమైన కాలిక్యులేటర్లను ఉపయోగించి తదనుగుణంగా కేలరీలను సర్దుబాటు చేసుకోవడం ఎంతైనా మంచిందని పోషక నిపుణులు సూచిస్తున్నారు.

3. హార్మోన్ల అసమతుల్యత :
హార్మోన్లు మీ శరీర బరువును అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. 8 మంది మహిళల్లో ఒక మహిళ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. తరచుగా బరువు పెరగడానికి లేదా బరువు తగ్గడానికి దారితీస్తుందని పోషకాహార నిపుణుడు పేర్కొన్నారు. కొన్ని కిలోల బరువు తగ్గడం కష్టంగా అనిపిస్తే.. మీ హార్మోన్ల పరిస్థితి ఎలా ఉందో వైద్యున్ని సంప్రందించి ఓసారి చెక్ చేసుకోండి.

4. నిద్ర లేమి :
నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరగవచ్చు. నిద్ర అనేది ఆకలి హార్మోన్లనతో పాటు జీవక్రియను ప్రభావితం చేస్తుంది. మీ బరువు తగ్గించుకోవాలనుకుంటే ప్రతి రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు మంచి నిద్ర తప్పనిసరిగా అవసరం.

5. ఒత్తిడి :
అనియంత్రిత ఒత్తిడి ఆరోగ్యానికి చాలా హానికరం. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ అధిక స్థాయిలు ఎక్కువ అయితే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం లేదా బ్రీతింగ్ ఎక్సరసైజులు వంటి పద్ధతులను ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!

ట్రెండింగ్ వార్తలు