Does eating white rice every day make you fat?
మన రోజువారీ జీవితంలో అన్నం (వైట్ రైస్) ఒక ప్రధాన భాగంగా మారిపోయింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పూటలా అన్నం తినకపోతే చాలా మందికి తిన్నట్టుగానే అనిపించదు. అంతలా మన జీవితంలో భాగం అయిపొయింది రైస్ అనేది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తున్న మాట ఏంటంటే.. రైస్ తక్కువగా తినడం వల్ల లావవుతారా? నిజంగా అన్నం మానేస్తే బరువు తగ్గవచ్చా అని. మరి ఏది నిజం… అన్నం తింటే నిజంగా లావవుతారా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లావు అవుతారు. అయితే అది కొన్ని పరిస్థితుల్లో మాత్రమే. ఎందుకంటే, వైట్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను వేగంగా పెంచుతుంది. దానివల్ల ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. క్రమంగా ఇది కొవ్వుగా మారి కరిగిపోకుండా శరీరంలో నిల్వ ఉండిపోతుంది. రైస్ ను రిఫైండ్ చేసేటప్పుడు దానిపై ఉండే పొట్టు, గింజ తొలగిపోతాయి. కాబట్టి, ఇందులో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది వేగంగా అరిగిపోయి త్వరగా ఆకలివేస్తుంది. అలా ఆకలేసిన ప్రతీసారి రైస్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి బరువు పెరిగే అవకాశం ఏర్పడుతుంది.
అన్నం(వైట్ రైస్) శరీరానికి ఎనర్జీ ఇచ్చే మంచి కార్బోహైడ్రేట్ మూలం. కాబట్టి, దీనిని పూర్తిగా మానేయడం వల్ల తలనొప్పి, తక్కువ ఎనర్జీ, కంఫ్యూజన్, మూడ్ స్వింగ్‌లు, పోషకాల లోపం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి, అన్నాన్ని ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ పరిమాణంలో, సమతుల్యంగా తినడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి.
బ్రౌన్ రైస్: ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. GI తక్కువగా ఉంటుంది. నెమ్మదిగా జీర్ణం అవుతుంది.
మిల్లెట్లు(బాజ్రా, జొన్న, రాగి): వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది, బీపీ & షుగర్ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది.
రెడ్ రైస్: వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
క్వినోవా: ఇది కంప్లీట్ ప్రోటీన్ ఆహారం. గ్లూటెన్ ఫ్రీగా లభిస్తుంది.
మిలెట్ రోటీలు: వీటిలో తక్కువ GI ఉంటుంది. ఎక్కువ శక్తి
వైట్ రైస్ తింటే తప్పనిసరిగా లావవుతారని చెప్పడం ఒక అపోహ. కానీ అతిగా, అసమతుల్యంగా, వ్యాయామం లేకుండా తింటే మాత్రం అదే నిజమవుతుంది. స్మార్ట్‌గా తినడం, సరైన సమయానికి తినడం, సమతుల్య డైట్ పాటించడం ఆరోగ్యానికి మంచి మార్గం. అన్నం మానేయాల్సిన అవసరం లేదు.