టీ ఎక్కువగా తాగుతున్నారా.. తలనొప్పి అందుకే

రోజువారీ జీవితంలో అలసట కలిగినా, అలవాటుగానో టీ తాగుతుంటాం. అదీ చలికాలంలో అయితే వేడివేడి ఛాయ్, కాఫీలు సిప్ వేసుకుంటూ తాగితే ఆ మజానే వేరు.  అయతే దేనికైనా హద్దు ఉంటుంది కదా. మోతాదుకు మించి తాగితే ఉపశమనం పక్కకు పెడితే ఆరోగ్యానికే ఎదురుదెబ్బ. అసలు ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదనేది ఓ సారి తెలుసుకుందాం. 

 

ఐరన్ శోషించుకోవడం తగ్గిపోతుంది: 
ఆహారంలో లభించే ఐరన్ శరీరానికి తప్పనిసరి. టీ ఆకుల్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్లు ఈ ఐరన్ శోషించుకోవడాన్ని ఆపేస్తాయట. దీని కారణంగానే టీ తాగే వారిలో ఐరన్ లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. వెజిటేరియన్ అయితే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. 

 

 

ఎముకలకు కావలసిన ఐరన్:
సాధారణంగా కాఫీలో కెప్ఫైన్ అనే పదార్థం కొద్దిపాటి రిలీఫ్ ఇస్తుంది. అదే పదార్థం టీ ఆకుల్లోనూ సహజంగానే ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే ఉత్తేజితం చేయడంతో పాటు, ఒత్తిడికి గురి చేస్తుంది. గ్రీన్, వైట్ టీలలో కంటే బ్లాక్ టీలో ఈ కఫ్ఫైన్ ఎక్కువగా ఉంటుంది. 

 

 

నిద్రలేమి:
నిద్రపోవడానికి ముందు చేయకూడని పనుల్లో టీ తాగడం ఒకటి. ముందుగా చెప్పుకున్నట్లే అందులో ఉండే కెఫ్ఫైన్ నిద్రావస్థను దూరం చేస్తుంది. కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా టీ తాగేవారిలో నిద్రకు సహకరించే హోర్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

 

 

తలతిరగడం:
కాస్త తలనొప్పిగా అనిపించడం, తల తిరగడం టీ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లు. నిజానికి టీ తాగడం వల్లనే తలనొప్పి రావడం, కడుపులో మంట పుట్టడం వంటివి వస్తాయట. 

 

 

నాసియా:
ఒక్కసారిగా గ్లాసులకు గ్లాసులు టీ తాగితే కడుపు నొప్పితో పాటు, తలనొప్పి, అజీర్ణం వంటివి సహజంగానే వస్తాయి. దాంతో పాటు టీ ఆకుల వల్ల నోరు చేదుగా, పొడి బారడం కూడా ఏర్పడవచ్చు. 

 

 

ట్రెండింగ్ వార్తలు