Healthy Eating : అతిగా అన్నం తింటున్నారా? మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..! ఎలా బయటపడాలంటే?
Healthy Eating : అతిగా అన్నం తినడమూ ఒక వ్యసనమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అలవాటు నుంచి నెమ్మదిగా బయటపడాలని.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- August 18, 2026 / 09:44 AM IST
Rice Heavy Eating
Healthy Eating : భారత దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం అన్నం. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువ మంది వరి అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. కొందరు మూడు పూటల భోజనం చేస్తారు. అయితే, వీరిలో కొందరు స్వల్పంగా తింటే.. మరికొందరు అతిగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నారు.
అతిగా అన్నం తినడమూ ఒక వ్యసనమేనని పరిశోధకులు చెబుతున్నారు. అన్నం, రిఫైన్డ్ కార్బోహైడ్రెట్లు మెదడులోని డోపమైన్ మార్గాలను మాదకద్రవ్యాల మాదిరిగానే ఉత్తేజపరుస్తాయి. అందుకే చాలామంది ఇతర ఆహారాలతో కడుపు నిండినప్పటికీ.. మనసు సంతృప్తి చెందక అన్నం తిని సంతృప్తి చెందుతారు. అయితే, ఇది శారీరక ఆకలి కాదు.. మెడదు కోరుకునే వ్యసనంగా పరిశోధకులు పేర్కొంటున్నారు. అన్నంపై ఆధారపడటం, ఎక్కువగా తినడం అలవాటుగా మారితే అది మానసిక బానిసత్వానికి దారితీస్తుంది. దీన్ని తగ్గించాలని ప్రయత్నించినప్పుడు కొందరిలో ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఇది పూర్తి వ్యసన లక్షణమేనని చెబుతున్నారు.
నష్టాలు ఇవే..
ఈ వ్యసనం వల్ల అనేక నష్టాలు కలుగతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ముప్పు పొంచి ఉన్నట్లేనని చెబుతున్నారు. అన్నాన్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి.. కాల క్రమేణా టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. అంతేకాక.. అన్నంలో కేలరీలు ఎక్కువ, పీచు పదార్థం తక్కువగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. అంతేకాక.. రక్తంలో చెక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోవటం వల్ల భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలసట, నిద్రమత్తు ఆవహిస్తాయి.
ఈ అలవాటు నుంచి ఎలా బయటపడాలంటే?
ఒక్కసారిగా అన్నం మానేయకుండా క్రమంగా పరిమాణాన్ని తగ్గించుకోవాలి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, తృణధాన్యాలు వాడటం మంచిది.
