Banana Side Effects: అరటిపండు తిన్నవెంటనే ఈ పనులు చేయకూడదు.. చేస్తే ఏమవుతుందో తెలుసా?

Banana Side Effects: అరటి పండ్లు తిన్న వెంటనే టీ, కాఫీ లాంటివి తాగకూడదట. ఇలా చేయడం వల్ల అనేకరకాల సమస్యలు తలెత్తుతాయట.

Banana benefits and side effects

అరటిపండు సాధారణంగా అన్ని సీజన్స్ లో దొరికే పండు. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫైబర్, ఫొటాషియం ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతీ ఒక్కరు కనీసం ఒక అరటిపండైనా తినాలని నిపుణులు చేతున్నారు. అయితే, అరటిపండు తినడం వరకు ఒకే కానీ, అరటిపండు తిన్నవెంటనే చేయకుండనే కొన్ని పనులు ఉన్నాయి. అవి చేయడం వల్ల అనారోగ్య ఉందని చెప్తున్నారు. మరి అరటిపండు తిన్న తరువాత చేయకూడని ఆ పనులు ఏంటి? చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెల్సుకుందాం.

అరటి పండ్లు తిన్న వెంటనే టీ, కాఫీ లాంటివి తాగకూడదట. ఇలా చేయడం వల్ల అనేకరకాల సమస్యలు తలెత్తుతాయట. ఆరోగ్య నిపుణుల ప్రకారం అరటిపండు తిన్న తరువాత టీ, కాఫీ తాగడం వల్ల అది జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. కడపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు కారణం అయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అరటి పండ్లు తిన్న వెంటనే టీ, కాఫీలు తాగడం చేయకూడదట. అలాగే, అరటి పండు తిన్న తరువాత వెంటనే నీరు తాగకూడదంట. నీరు తాగడం వల్ల కూడా అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

కొంతమంది అరటి పండు తిన్న వెంటనే పాలు తాగుతారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటుగా చెప్తున్నారు. అరటి పండు, పాలు కలిపి తీసుకోవడం వల్ల అది విషపూరితంగా మారే అవకాశం ఉంది. ఇది జీర్ణ సమస్యలకు, చర్మ సమస్యలకు కారణం అవ్వొచ్చు. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అలర్జీ దద్దుర్లు, దురద కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రెండు ఒకేసారి తీసుకోవడం మంచిది కాదట.

అలాగే అరటి పండు తిన్న వెంటనే చల్లటి వస్తువులు తీసుకోకూడదట. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటివి అరటి పండుతో కలిపి తీసుకోవడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అందుకే వీలైనంతమట్టుకు ఈ రెండు కలిపి తినకుండా ఉండేలా చూసుకోండి.

ఇంకా చాలా మంది రాత్రిపూట భోజనము చేసిన తరువాత అరటి పండు తింటారు. తిన్న వెంటనే నిద్రపోతారు. అరటిపండులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి.. ఇది స్థూలకాయానికి దారి తీయవచ్చు. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కారణం కావచ్చు. అందుకే అరటి పండు తిన్న వెంటనే నిద్ర పోవడం చేయడం మంచిది కాదు.