షాకింగ్ : జాన్సన్ బేబీ షాంపూలు కూడా ప్రమాదమే

రాజస్థాన్ : జాన్సన్ అండ్ జాన్సస్ కంపెనీకి మరో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేసిన పౌడరే కాదు.. బేబీ షాంపూ కూడా హాట్ టాపిక్ గా మారింది. బేబీ షాంపూ క్వాలిటీ టెస్ట్ లో

  • Publish Date - April 1, 2019 / 01:39 PM IST

రాజస్థాన్ : జాన్సన్ అండ్ జాన్సస్ కంపెనీకి మరో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేసిన పౌడరే కాదు.. బేబీ షాంపూ కూడా హాట్ టాపిక్ గా మారింది. బేబీ షాంపూ క్వాలిటీ టెస్ట్ లో

రాజస్థాన్ : జాన్సన్ అండ్ జాన్సస్ కంపెనీకి మరో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేసిన పౌడరే కాదు.. బేబీ షాంపూ కూడా హాట్ టాపిక్ గా మారింది. బేబీ షాంపూ క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. రాజస్థాన్‌ ప్రభుత్వం  జరిపిన ఈ పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. అందులో హానికారిక పదార్దాలు (ఫార్మల్‌ డిహైడ్‌) ఉన్నట్టు గుర్తించారు. దీంతో బేబీ షాంపూ కూడా డేంజరే అని వెల్లడైంది. మార్చి 5న జాన్సన్ కంపెనీకి చెందిన 2 బ్యాచ్‌ల బేబీ షాంపూలకు సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాజస్థాన్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఆ షాంపూల్లో ప్రమాదకర పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్‌ డిహైడ్ ఉన్నట్లు కనుగొంది. ఈ ఫార్మల్‌ డిహైడ్‌ను భవన నిర్మాణ సామగ్రి తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని కార్సినోజెన్ అని కూడా పిలుస్తారు.

అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చిన్నారులకు సంబంధించిన ఉత్పత్తులకు పెట్టింది పేరు. అలాంటి కంపెనీకి చెందిన బేబీ షాంపూలో ప్రమాదకర పదార్దాలు ఉన్నాయని తేలడంతో రెండు బ్యాచ్ ల  షాంపూ బాటిళ్లపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత జరిపిన క్వాలిటీ టెస్ట్ లో రిజల్ట్ నెగిటివ్ గా వచ్చింది.
Read Also : కారు కేసీఆర్ దే…స్టీరింగ్ మజ్లీస్ చేతిలో‌

బేబీ షాంపూలో ప్రమాదకర పదార్దాలు ఉన్నాయని వచ్చిన రిపోర్ట్ పై జాన్సన్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఆ రిపోర్ట్ ను అస్సలు అంగీకరించబోమని స్పష్టం చేసింది. నో మోర్ టియర్స్  పేరుతో ఉత్పత్తి చేస్తున్న బేబీ షాంపూలు సురక్షితమైనవని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నామని జాన్సన్ సంస్థ వాదిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్థితుల్లో తమ  ఉత్పత్తులకు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తామని, తమ ఉత్పత్తులన్నీ సేఫ్ అని చెప్పింది.

కొన్ని నెలల కిందటే జాన్సన్ బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేలడం, జాన్సన్ బేబీ పౌడర్ పై బ్యాన్ విధించడం తెలిసిందే. ప్రభుత్వ పరీక్షల్లో అలాంటిదేమీ లేదని తేలడంతో ఫిబ్రవరిలోనే మళ్లీ బేబీ పౌడర్ ఉత్పత్తిని సంస్థ ప్రారంభించింది. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటపడుతున్నారు. ఇంతలోనే ఆ కంపెనీకి మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. బేబీ షాంపూ కూడా డేంజర్ అని తేలడం, అందులో హానికారక పదార్దాలు ఉన్నాయని తెలియడం ఆ ప్రొడక్ట్స్ వాడే పిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.
Read Also : ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్ : బైక్‌ను లాఠీతో పగలకొట్టాడు