Thalassemia Major: తలసేమియా మేజర్-క్లాస్ IIIతో బాధపడుతున్న తన 13 ఏళ్ల కుమార్తెకు ఓ తల్లి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బోన్ మ్యారో (ఎముక మజ్జ) ను దానం చేసింది. తలసేమియా మేజర్ అనేది వారసత్వంగా వచ్చే వ్యాధి. ఇందులో ఎర్ర రక్త కణాల జీవితకాలం సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వారికి జీవితాంతం ప్రతినెలా రక్తమార్పిడి అవసరం పడుతుంది. తరచుగా రక్తమార్పిడి చేయడం వల్ల హెపటైటిస్, హెచ్‌ఐవి వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు, ఐరన్ ఓవర్‌లోడ్ కారణంగా అవయవాలు పాడు అవుతాయి. దీనితో పాటు ఎదుగుదలకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు.
వైజాగ్‌కు చెందిన రోగి తన 8 నెలల వయస్సు నుంచి సాధారణ రక్తమార్పిడి, చీలేషన్ థెరపీలో ఉన్నారు. రోగిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) కి చెందిన పీడియాట్రిక్-హెమటో-ఆంకాలజిస్ట్, BMT స్పెషలిస్ట్ డాక్టర్ C.S. రంజిత్ కుమార్ కు రెఫర్ చేశారు. ఆమెను పరీక్షలు చేసిన తర్వాత, హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఆమె తల్లి (32 ఏళ్ల వయస్సు) ని దాతగా సిఫార్సు చేశారు.
Rangasthalam : జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం.. బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీగా..
AOI హైదరాబాద్ గత 6 నెలల్లో సుమారు 10 తలసేమియాకేసులను నమోదు చేసింది. వాటిలో 5 క్లాస్ III (7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కేసులు ఉన్నాయి. సంక్లిష్టమైన కేసులను నిర్వహించడంలో అనుభవం ఉన్న AOI హైదరాబాద్‌లోని BMT బృందం గత 2 సంవత్సరాలలో 100+ BMT కేసులను నిర్వహించింది, వీటిలో 30+ కేసులు పిల్లల ఎముక మజ్జ మార్పిడికి సంబంధించినవి.