Rangasthalam : జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం.. బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీగా..
రామ్ చరణ్ రంగస్థలం జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ తోనే అదరగొడుతుంది. నిన్నటి వరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న ఇండియన్ మూవీగా..

Ram Charan Rangasthalam creates records at japan box office
Rangasthalam : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాన్ బాహుబలి క్యాటగిరిలో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ 216 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సంచనలం సృష్టించింది. రామ్ చరణ్ లోని కంప్లీట్ యాక్టర్ ని ఈ సినిమా ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అయ్యింది. మగధీర సినిమాతో జపాన్ లో రామ్ చరణ్ కి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది.
Baby Movie : బేబీ మూవీ పై దర్శకుడు బీవీఎస్ రవి వైరల్ ట్వీట్.. మీరు ఇడియట్స్, దురదృష్టవంతులు..!
ఇక ఇటీవల రిలీజ్ అయిన RRR తో ఆ ఫాలోయింగ్ మరింత పెరిగింది. దీంతో సూపర్ హిట్ మూవీ ‘రంగస్థలం’ని రిలీజ్ చేయాలంటూ డిమాండ్ రావడంతో.. నేడు జులై 14న జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో పాటు ఇండియన్ బ్లాక్ బస్టర్ KGF 1, KGF 2 చిత్రాలు కూడా నేడు రిలీజ్ అయ్యాయి. అయితే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద యశ్ కంటే చిట్టిబాబు డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రంగస్థలం 2.5 మిలియన్ యాన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇక మొదటిరోజు మొత్తం కలెక్షన్స్ కలుపుకొని ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించినట్లు చెబుతున్నారు. 2023 గాను జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న ఇండియన్ మూవీగా నిన్నటి వరకు ‘బ్రహ్మాస్త్ర’ మూవీ నిలిచింది. ఇప్పుడు ఆ ప్లేస్ ని రంగస్థలం ఆక్రమించింది. ఈ మూవీ అక్కడ మంచి టాక్ అందుకుంటే గనుక ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచే అవకాశం కూడా ఉందంటున్నారు సినీ పండితులు. మరి చిట్టిబాబు జపాన్ లో ఏమి చేయబోతున్నాడో చూడాలి.