వయాగ్రా కంటే పవర్ ఫుల్.. రొమాన్స్‌లో రెచ్చిపోవాలంటే.. గుమ్మడి గింజలు తినాల్సిందే!

  • Publish Date - February 29, 2020 / 01:19 PM IST

రొమాన్స్‌లో వీక్ అనే భావించే శృంగార పురుషులకు శుభవార్త.. ఇక ప్రతిరాత్రి వసంత రాత్రే.. వయాగ్రాను వదిలేయండి.. గుమ్మడి గింజలను రోజు గుప్పెడు తినండి.. రొమాన్స్‌లో మీ వేగాన్ని ఎవరూ అందుకోలేరు. నాన్ స్టాప్ సర్వీసులా రొమాన్స్‌లో రెచ్చిపోతారు. మీ భాగస్వామిని సంతృప్తిపరిచానన్న ఫీలింగ్ తప్పక కలుగుతుందని అంటున్నారు సెక్సాలిజిస్టులు. గుమ్మడి గింజల్లో అంత శక్తి దాగి ఉందని చెబుతున్నారు. సహజసిద్ధంగా లభించే ఈ ఇలాంటి గింజలను ప్రతిరోజు తీసుకుంటే ఉంటే మీలో శృంగార సామర్థ్యాన్ని అత్యంత వేగంగా పెంచుతుంది. రొమాన్స్ చేస్తున్న సమయంలో అలుపే రాదంటా.. వయాగ్రా కంటే గుమ్మడి గింజలే ఎంతో శక్తివంతమైనవని పరీశోధకులు తేల్చిచెప్పేశారు. 

శృంగార సామర్థ్యం.. సంతాన సమస్యలకు చెక్ :
వయాగ్రా వంటి ఇంగ్లీష్ మందుల కోసం డబ్బులు ఖర్చు చేసి అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే బదులు ప్రకృతిసిద్ధంగా లభించే ఈ గుమ్మడి గింజలను చక్కగా తినేయండి.. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు.. పైగా ఎంతో ఆరోగ్యం కూడా.. గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. జింక్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, సెలీనియం, కాల్షియం, పాస్ఫరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ, విటమిన్ బీ వంటి ఎన్నో రకాల పోషకవిలువలు పుష్కలంగా ఉన్నాయి.

శృంగారంలో వీక్ అని బాధపడే పురుషులు ఈ గుమ్మడి గింజలు గానీ తింటే వారిలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. శుక్ర కణాల్లో కదిలికలు ఏర్పడి సంతానలేమి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ప్రత్యేకించి పురుషుల్లో టెస్టోస్టిరాన్ విలువలను పెంచుతాయి. శృంగార సామర్థ్యం బాగా పెరిగిపోతుంది. గుమ్మడి గింజలు తినేవారిలో పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు ఎప్పటికి రాకుండా అడ్డుకునే గుణం ఈ గింజల్లో ఉందని పరిశోధకులు అంటున్నారు. 

అంగస్తంభన సమస్యలా? ఇవి తినండి :
సాధారణంగా చాలామంది పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఉంటాయి. అంగస్తంభన సమస్యలు ఉన్న మగాళ్లు.. తాము శృంగారానికి పనికిరామని తెగ బాధపడిపోతుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. వయాగ్రా వంటి ఇంగ్లీషు మందులు తెగ మింగేస్తుంటారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోయే సరికి మళ్లీ నిరూత్సహపడుతుంటారు. చిరాకుపడి పోతుంటారు. తమను తాము నిందించుకుంటుంటారు. ఇలాంటి పురుషులంతా ఒకసారి ఈ గుమ్మడి గింజలను తిని చూడండి.. మీ శృంగార సామర్థ్యాన్ని అడ్డుకోవడం ఆ మన్మధుడికి కూడా సాధ్యం కాదంటారు… అంగస్తంభన సమస్యలతో బాధపడేవారిలో అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారట.

30 మిలియన్ల మంది పురుషుల్లో ఈ అంగస్తంభన సమస్య ఉంటున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. అందులో 40 మంది పురుషుల్లో కచ్చితంగా అంగస్తంభన సమస్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. United States Department of Agriculture (USDA) ప్రకారం.. ప్రతిరోజు 2 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను తింటూ ఉంటే వారిలో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల ఆరోగ్యానికి వయాగ్రా కంటే ఎంతో సమర్థవంతంగా.. శక్తివంతంగా గుమ్మడి గింజలు బాగా పనిచేస్తాయని అంటున్నారు. 

-> వాస్తవానికి.. పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గడానికి మూడు కారణాలు కావొచ్చు. 
* హార్మోన్లలో లోపం, హార్మోన్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం.
*  రక్త ప్రసరణ సరిగా లేకపోవడం
* మానసిక ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, ఆందోళన

గుమ్మడి గింజలతో కలిగే ప్రయోజనాలివే : 
* శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది.
* వీర్యం స్థాయి తగినంత స్థాయిలో ఉత్పత్తి అవుతుంది.
* అంగస్తంభన సమస్యలు తగ్గిపోతాయి.
* శుక్రకణాల్లో కదిలిక బాగా ఉంటుంది. 
* సంతానోత్పత్తికి ఎంతో సానుకూలంగా ఉంటుంది.
* గ్యాస్టిక్, బ్రెస్ట్, లంగ్, కేన్సర్లు దగ్గరకు చేరవు. 
* మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు తక్కువ
* గుండెకు ఎంతో ఆరోగ్యం.. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తాయి.
* ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు
* డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. 

ట్రెండింగ్ వార్తలు