Chevella: వికారాబాద్ ఇల్లాలోని చేవెళ్ల మండలం పామెన గ్రామంలో వెల్‌స్పన్ గ్రూప్ మెగా భారీ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించింది. ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్‌లతో సహా ఎనిమిది వేర్వేరు విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం లబ్ధిదారులకు తమ నైపుణ్యం, సహాయాన్ని అందించడానికి కలిసి వచ్చాయి. ఈ శిబిరంలో వైద్య సహాయం కోరిన 198 మంది గ్రామస్తులకు వైద్య బృందం సేవలు చేశాయి.
IMT Hyderabad: స్ఫూర్తిదాయక కమ్యూనిటీ కనెక్ట్ సందర్శనను పూర్తి చేసిన ఐఎంటీ హైదరాబాద్ పీజీడీఎం బ్యాచ్
అట్టడుగు స్థాయి ఆరోగ్య సంరక్షణ రంగంలో చేస్తున్న సేవపై స్థానిక నాయకుడు మల్లా రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ “అవసరంలో ఉన్నవారికి వారి ఇంటి వద్దనే మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అంకితమైనటువంటి నిబద్ధత కలిగిన సంస్థల మద్దతు మాకు అందించినందుకు సంతోషంగా ఉంది. ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా వారు అందిస్తూ సమాజాన్ని శక్తివంతం చేస్తున్నారు” అని ఆయన అన్నారు.