ఆరోగ్యశ్రీ, రైతుబంధు, రైతుబీమా ఆగిపోతాయి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో

  • Publish Date - September 22, 2019 / 07:57 AM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. దేశంలో పేదరికానికి కాంగ్రెస్, బీజేపీనే కారణం అని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ, రైతుబంధు, రైతు బీమా ఆగిపోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బీజేపీ పాలన కంటే టీఆర్ఎస్ పాలన 100 రెట్లు బాగుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా పథకాలు ఉన్నాయా అని అడిగారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని నాందేడ్ రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపండి అంటున్నారంటే.. టీఆర్ఎస్ పాలన ఎంత అద్భుతంగా చెప్పక్కర్లేదున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలే టీఆర్ఎస్ పాలనను ప్రశంసిస్తున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. నాందేడ్ ప్రజలు టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తామంటున్నారు అని కేసీఆర్ ప్రస్తావించారు.

ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన రోజును అమిత్ షా డార్క్ డే అంటారు.. దీన్ని మానుకోవాలి అని కేసీఆర్ సూచించారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మోసం చేసేందకు పోటీ పడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. కచ్చితంగా మరో రెండు టర్మ్ లు మేమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మా దగ్గర ఇంకో రెండు, మూడు స్కీములు ఉన్నాయన్న కేసీఆర్.. ఆ స్కీమ్ లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పని ఖతమే అన్నారు. దుర్మార్గాలకు దేశంలో ఉన్న బ్రీడింగ్ సెంటరే కాంగ్రెస్ అని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలోనే నక్సలిజం పుట్టుకొచ్చిందని సీఎం చెప్పారు. బీజేపీ కూడా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. చట్టాలు మార్చాల్సి వస్తే మారుస్తామని స్పష్టం చేశారు. దేశమే గర్వపడేలా రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామన్నారు.