ఈసీ టార్గెట్ గా కాంగ్రెస్ కార్టూన్ : ఓవైసీ కౌంటర్ ఎటాక్

తెలంగాణ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదాస్పదమైన కార్టూన్‌తో రచ్చ చేశారు. తెలంగాణలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కన్నీరు పెట్టుకునేలా పాలన జరిగిందంటూ తెలంగాణ నాయకులను ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదాస్పదమైన కార్టూన్‌తో రచ్చ చేశారు. తెలంగాణలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కన్నీరు పెట్టుకునేలా పాలన జరిగిందంటూ తెలంగాణ నాయకులను ఎద్దేవా చేశారు. ఆ కార్టూన్‌లో కీలకమైన వ్యక్తులుగా కేసీఆర్‌తో పాటు ఒవైసీ కూడా ఉండడం గమనార్హం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ కాంగ్రెస్ నాయకులు హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు. 

ఈ కార్టూన్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. ‘ఇదే స్థానంలో మీ 50 సంవత్సరాల రాహుల్ గాంధీని, కొత్తగా జనరల్ సెక్రటరీగా నియమితురాలైన ప్రియాంక గాంధీని ఉంచితే ఎలా ఉంటుందో ఆలోచించుకొమ్మని ప్రశ్నించారు. ఘోర పరాజయం తర్వాత ఏం చేయాలో తెలియక ఇటువంటి నీచమైన కార్టూన్లతో ప్రచారం చేసుకుంటున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. 

కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధృతరాష్ర్టుడితో, ఈఆర్‌వో, డీఈవో, సీఈవోలను దుశ్శాసనుడితో, ఓటర్లను ద్రౌపదితో పోల్చుతూ బ్యానర్ ఏర్పాటు చేశారు.