అసలేం జరిగింది : 5వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
- Subhan Ali Shaik
- Published On : September 24, 2019 / 12:07 PM IST
హైదరాబాద్ సిటీలో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనగూడలో ఉన్న ల్యాండ్ మార్క్ రెసిడెన్సీలో మహిళ నివాసం ఉంటుంది. మహితి(28)అనే యువతి మంగళవారం అపార్ట్‌మెంట్ ఐదో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలు టీసీఎస్‌లో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు.. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
