పగలే చీకట్లు: హైదరాబాద్ లో భారీ వర్షం

  • Publish Date - September 22, 2019 / 10:03 AM IST

హైదరాబాద్ నగరంలో వర్షం కుమ్మేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిస్తుంది. ఫలితంగా రోడ్లు జలమయం అయిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశం మేఘావృతం అవడంతో పగలే చీకట్లు కమ్ముకున్నాయి.

దట్టమైన మేఘాలతో చీకటి పడిపోయి భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్‌ సిటీ మొత్తం ఇలాంటి పరిస్థితే ఉంది. చార్మినార్‌, కోటి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్‌ సిటీ, కూకట్‌ పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లోనూ వాన జోరుగా కురుస్తుంది. 

మధ్యాహ్నం 4గంటలు కూడా కాకముందే ఆరు గంటలు అయ్యిందా అన్నట్లు అనిపిస్తుంది. ఉరుములుతో కూడిన భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఆదివారం కావడంతో పెద్దగా వాహనాలు రోడ్డుపైకి రాట్లేదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులైతే పెద్దగా లేవు. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది.