K.T.Rama Rao slams bjp: బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్

బండి సంజయ్ వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ తీరు మూర్ఖత్వంతో కూడుకుని ఉందని ఆయన చెప్పారు. ‘‘ఉచితాలు వద్దని ఓ వైపు విశ్వ గురు (ప్రధాని మోదీ) అంటున్నారు, మరోవైపు, ఈ జోకర్ ఎంపీ ఉచితంగా విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ దేశాన్ని బీజేపీయే పాలిస్తోంది కదా? దేశంలోని పేదలకు ఉచితంగా ఇళ్లు, విద్య, వైద్యం అందించకుండా ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు?’’ అని కేటీఆర్ విమర్శించారు.

K.T.Rama Rao slam bjp

K.T.Rama Rao slams bjp: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ఉచితంగా విద్య, వైద్యం, విద్య ఇస్తామంటూ నిన్న హైదరాబాద్ లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ తీరు మూర్ఖత్వంతో కూడుకుని ఉందని ఆయన చెప్పారు.

‘‘ఉచితాలు వద్దని ఓ వైపు విశ్వ గురు (ప్రధాని మోదీ) అంటున్నారు, మరోవైపు, ఈ జోకర్ ఎంపీ ఉచితంగా విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ దేశాన్ని బీజేపీయే పాలిస్తోంది కదా? దేశంలోని పేదలకు ఉచితంగా ఇళ్లు, విద్య, వైద్యం అందించకుండా ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు?’’ అని కేటీఆర్ విమర్శించారు.

డ్రగ్స్, మద్యం, ఇసుక, భూములు వంటి అన్ని కుంణకోణాల్లో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సైతం సరిగా చేయడం లేదని కూడా బండి సంజయ్ నిన్న విమర్శలు గుప్పించారు. కాగా, ఉచితాలు వద్దంటూ ప్రధాని మోదీ కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరుగుతోంది.

Zelenskyy car accident: కారు ప్రమాదానికి గురైన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ