ఓటుహక్కు పొందడం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటర్లు నమోదు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు. అర్హులైన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు పలుచోట్ల సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికలు సంఘం. ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫొటో, వయసు ధృవీకరణ, చిరునామా తెలిపే గుర్తింపు కార్డులు ఉంటే సరిపోతుంది.
18 ఏళ్లు నిండిన యువతీయువకులు, ఓటరు జాబితాలో పేరులేని వారు, అర్హులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియని ఎల్లప్పుడూ ఓటరు నమోదు, పేర్లు, చిరునామాల సవరణ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణ చేస్తున్నామని, తుది జాబితాను ఈనెల 25న విడుదల చేయనున్నామని అధికారులు చెప్పారు. సాయంత్రంలోగా అర్హులైన వారు ఓటరుగా నమోదు కావాలన్నారు.