×
Ad

COVID 19 Telangana : 24 గంటల్లో 573 కేసులు, కోలుకున్నది 609 మంది

  • Published On : December 13, 2020 / 08:55 AM IST

COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో 573 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 724 కు చేరాయి. 609 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 68 వేల 601 ఉన్నాయి. నలుగురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 493 మందికి చేరుకుంది. 2020, డిసెంబర్ 13వతేదీ ఆదివారం ప్రజారోగ్య మరియు కుటుంబసంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేల 630 ఉండగా..గృహ/సంస్థల ఐసోలేషన్ లో గల వ్యక్తుల సంఖ్య 5 వేల 546 ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసులు :

ఆదిలాబాద్ – 07. భద్రాద్రి కొత్తగూడెం – 19. జీహెచ్ఎంసీ – 127. జగిత్యాల – 09. జనగామ – 07. జయశంకర్ భూపాలపల్లి : 07. జోగులాంబ గద్వాల : 01. కామారెడ్డి : 05. కరీంనగర్ – 22. ఖమ్మం – 33. కొమరం భీం ఆసీఫాబాద్ – 05. మహబూబ్ నగర్ – 09. మహబూబాబాద్ – 06. మంచిర్యాల – 12. మెదక్ – 06. మేడ్చల్ మల్కాజ్ గిరి – 67. ములుగు – 11. నాగర్ కర్నూలు : 06. నల్గొండ – 12. నారాయణపేట – 04. నిర్మల్ – 06.

నిజామాబాద్ – 08. పెద్దపల్లి – 13. రాజన్న సిరిసిల్ల – 07. రంగారెడ్డి – 57. సంగారెడ్డి – 17. సిద్ధిపేట – 15. సూర్యాపేట – 14. వికారాబాద్ – 03. వనపర్తి – 00. వరంగల్ రూరల్ – 09. వరంగల్ అర్బన్ – 33. యాదాద్రి భువనగిరి – 15. మొత్తం :- 573.