కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2010లో నమోదు అయిన చెక్ బౌన్స్ కేసు ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2010లో నమోదు అయిన చెక్ బౌన్స్ కేసు ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ సినిమా విషయంలో దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి.. మోహన్ బాబు మధ్య విబేధాలు వచ్చాయి. డబ్బు విషయంలో ఈ గొడవ తలెత్తింది. దీంతో 40లక్షల 50వేల రూపాయలకు సంబంధించిన బ్యాంక్ చెక్కులను మోహన్ బాబు ఇచ్చారు. బ్యాంకులో డబ్బు లేకపోవటంతో చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. తొమ్మిదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు తీర్పు చెప్పింది.
Read Also : చెక్ బౌన్స్ కేసు : మోహన్ బాబుకి బెయిల్
మొత్తం డబ్బును 3 నెలల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది కోర్టు. అదనంగా ఒక లక్షా 25వేలు జరిమానా విధించింది. మొత్తం 41 లక్షల 75 వేల రూపాయలు మోహన్ బాబు చెల్లించాలని ఆదేశిస్తూ గడువు ఇచ్చింది. డబ్బులు సకాలంలో ఇవ్వకుండా మోసం చేసినందుకు ఏడాది జైలు శిక్ష కూడా విధించింది కోర్టు.
కోర్టు మూడు నెలలు గడువు ఇచ్చిందని.. ఈలోపు డబ్బు కట్టాల్సి ఉంటుందని న్యాయవాది తెలిపారు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మంచు మోహన్ బాబుగా కోర్టు తేల్చింది.
Read Also : జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు