సీఎం కేసీఆర్ కు కొత్త పాస్ పోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు.

  • Publish Date - April 6, 2019 / 04:14 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఏప్రిల్ 5 శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు కార్యాలయానికి వెళ్లారు. 20 నిమిషాల పాటు ఆయన అక్కడే ఉన్నారు. దౌత్యపరమైన పాస్ పోర్టు కోసం కేసీఆర్ కు దరఖాస్తు చేసుకున్నారు. రీజినల్ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి సీఎంకు కొత్త పాస్‌పోర్టును అందజేశారు. అనంతరం కేసీఆర్ కాసేపు పాస్‌పోర్టు సేవాకేంద్రం పనితీరుపై ఆరా తీశారు.

Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో

పాస్‌పోర్టుల జారీల్లో జాప్యం జరుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అత్యంత వేగంగా పాస్‌పోర్టులను జారీ చేసే రాష్ట్రంగా రికార్డు సృష్టించిన తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులకు సూచించారు.

సీఎం కేసీఆర్ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం ద్వారంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. 
Read Also : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం