Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ లోని బహదూర్ గూడలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన శంషాబాద్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఓ అమ్మాయి నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
కాగా, ఇవాళ సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్.. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్‌కు పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభాన్ని ఆయన సందర్శిస్తారు. ఈ యాత్రలో జైరాం రమేశ్ కూడా పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారు. ఇవాళ రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్‌లో కార్నర్ సమావేశం ఉంటుంది. ఇవాళ సాయంత్రం రాహుల్ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత బోయిన్ పల్లిలో రాహుల్ గాంధీ బస చేస్తారు. రాహుల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 1,000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. నిన్న జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని భద్రతను పెంచారు. పాలమాకులలో ఓ దుండగుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని రాహుల్ గాంధీ వద్దకు వచ్చాడు. సీఆర్పీఎఫ్ బలగాలు అతడిని బయటకు పంపాయి.
Another beautiful start to our fight for justice.#BharatJodoYatra pic.twitter.com/LHJnKSvYVH
— Congress (@INCIndia) November 1, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..