మాజీ మంత్రులకు ప్రభుత్వ సౌకర్యాలు తొలగించింది. ఇప్పటికే మాజీ మంత్రులకు సెక్యూరిటీ తగ్గించింది.
హైదరాబాద్ : కేబినెట్ కూర్పుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మాజీ మంత్రులకు ప్రభుత్వ సౌకర్యాలు తొలగించింది. ఇప్పటికే మాజీ మంత్రులకు సెక్యూరిటీ తగ్గించింది. ప్రభుత్వ వాహనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బుల్లెట్ ప్రఫ్ వాహనంతోపాటు మరో వాహనాన్ని వెనక్కి తీసుకుంది. గన్ మెన్ లను వెనక్కి తీసుకున్నారు. ఇక మాజీ మంత్రులు సొంత వాహనాలను ఎక్కనున్నారు. కొత్త మంత్రుల కోసం మినిస్టర్స్ క్వార్టర్స్ కు మరమ్మత్తులు చేయనున్నారు. దీని కొసం మాజీ మంత్రులను మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించనున్నారు.
ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ క్వార్టర్స్ తీసుకోలేదు. వీరిద్దరు తప్ప మిగిలిన మాజీ మంత్రులు మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉన్నారు. సంక్రాంతి తర్వాత మాజీ మంత్రులందరినీ ఖాళీ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలుగా మంత్రులుగా ఉన్న కొంతమందికి మాత్రం సొంత వాహనం కూడా లేదు. వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాల్లోనే వారు వెళ్తున్నారు.