Check It : ఏప్రిల్ 11న సెలవు

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

  • Publish Date - March 30, 2019 / 02:25 AM IST

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ప్రభుత్వం హాలీడే ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని తెలిపింది. పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లో నిర్వహించే కార్యాలయాలకు పోలింగ్‌కు ముందు రోజు ఏప్రిల్‌ 10తో పాటు పోలింగ్‌ రోజు ఏప్రిల్‌ 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది.
Read Also : గుర్తు పెట్టుకోండి : ఏప్రిల్ 1 బ్యాంకులకు హాలీడే

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న మే 23న అవసరమైతే స్థానిక సెలవును ప్రకటించాలని కలెక్టర్లను కోరింది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ రోజు పరిశ్రమలు, కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో  కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికలు జరగని బయటి ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనంతో కూడిన సెలవు  వర్తిస్తుందని పేర్కొంది.

ఏప్రిల్ 11న పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం.. ఏప్రిల్ 10న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పోలింగ్ ఏర్పాట్ల కోసం, మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లకు స్థానికంగా సెలవులు మంజూరు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి శుక్రవారం(మార్చి 29, 2019) ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also : ముఖ్య గమనిక : ఏప్రిల్ 1, 2 తేదీల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు