చెన్నైలో పొంగల్ జరుపుకున్న తెలంగాణ గవర్నర్

  • Publish Date - January 14, 2020 / 12:56 PM IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగను స్వరాష్ట్రం తమిళనాడులో జరుపకుంటున్నారు.  చెన్నైలోని తన నివాసంలో  కుటుంబ సభ్యులతో కలిసి ఆమె  పొంగల్ వేడుకల్లో పాల్గోన్నారు. తమిళనాడుకు, తెలంగాణ కు మధ్య వారధిగా తాను ఉంటానని ఆమె తెలిపారు.

తెలంగాణ ప్రజలు  తమిళనాడు లోని దేవాలయాలు వాటి శిల్పసౌందర్యాన్ని వీక్షించాలని ఉత్సాహంగా ఉంటారని ఆమె చెప్పారు. పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహాకానికి ఇరు రాష్ర్టాల మధ్య వారధిలా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. జల బంధం.. తదితర అంశాలపై తనకు అనేక ఆలోచనలు ఉన్నాయని గవర్నర్‌ తెలిపారు.

తెలంగాణ ప్రజలు తమిళనాడులోని ఆలయాలను సందర్శించి దేవుడిని ప్రార్థించి.. ఇక్కడి ప్రాచీన శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించాలని ఆహ్వానిస్తున్నాని గవర్నర్‌ పేర్కొన్నారు.