మున్సిపోల్స్ కి లైన్ క్లియర్ : పిటీషన్లు కొట్టేసిన హై కోర్టు

  • Publish Date - January 7, 2020 / 02:02 PM IST

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్న దాఖలైన పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం కొట్టివేసింది. దీంతో  రాష్ట్రంలో మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి లైన్‌క్లియర్‌ అయింది. దీంతో యథావిధిగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి.

కాగా మున్సి పల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్‌ అయింది.

మంగళవారం జనవరి7వ తేదీ రాత్రిలోపు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడాన్ని తప్పుపడుతూ టీపీసీసీ చీఫ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంను కూడా హైకోర్టు కొట్టివేసింది.