ఫిబ్రవరి 1 నుంచి ఆర్టీసీ స్టూడెంట్ బస్ పాస్‌లు జారీ
- Subhan Ali Shaik
- Updated on- January 26, 2021 / 08:08 AM IST
tsrtc-
Tsrtc Bus Passes: కాలేజీలు, స్కూల్స్ విద్యార్థులకు ఎప్పటిలానే ఫ్రీ, రూట్, స్టూడెంట్ జనరల్, స్టూడెంట్ గ్రేటర్, స్టూడెంట్ స్పెషల్, స్టూడెంట్ ఎక్స్‌క్లూజివ్, డిస్ట్రిక్ బస్‌పాస్‌లను జారీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్‌రావు సోమవారం ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి బస్‌పాస్‌ల జారీ మొదలవుతుందని చెప్పారు.
బస్ పాస్ రూల్స్ పాటిస్తూ.. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించి బస్‌పాస్ కోడ్ పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకే బస్‌పాస్‌లను జారీ చేయనున్నట్లు తెలిపారు. బస్‌పాస్‌లను పొందే విద్యార్థులు తమ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ కోడ్‌తో సహా, నిర్దేశిత పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిర్దేశిత బస్‌పాస్ కేంద్రంలో పాస్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
34 కేంద్రాలు ఏర్పాటు
వనస్థలిపురం, ఎల్‌బీనగర్, ఉప్పల్, తుక్కుగూడ, తార్నాక, శంషాబాద్, సనత్‌నగర్, రిసాలా బజార్, సికింద్రాబాద్, పఠాన్‌చెరు, ఎన్‌జీవో కాలనీ, మొయినాబాద్, మిథాని, మెహిదీపట్నం, మేడ్చల్, లింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, షాపూర్‌నగర్, సుచిత్ర, సీబీఎస్, ఛార్మినార్, ఫరూఖ్‌నగర్, జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్, అఫ్జల్‌గంజ్, ఆరాంఘర్, బాలానగర్, దిల్‌సుఖ్‌నగర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఘట్‌కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, కాచిగూడ కేంద్రాలలో బస్‌పాస్‌లను పొందవచ్చని తెలిపారు.
