వనస్థలిపురం పనామా అటెన్షన్ డైవర్షన్ కేసులో కీలక ఆధారాలు
హైదరాబాద్ లోని వనస్థలిపురం పనామా అటెన్షన్ డైవర్షన్ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
- veegam team
- Updated on- October 13, 2021 / 10:48 AM IST
Vanastalipuram Panama Attention Diversion Case Key Sources Collection
హైదరాబాద్ లోని వనస్థలిపురం పనామా అటెన్షన్ డైవర్షన్ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
హైదరాబాద్ లోని వనస్థలిపురం పనామా అటెన్షన్ డైవర్షన్ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 58 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. దోపిడికి పాల్పడింది రాంజీనగర్ గ్యాంగ్‌గా గుర్తించారు.
చెన్నై, బెంగళూరులలో కూడా ఇలాగే దోపిడిలకు పాల్పడ్డట్లు తేల్చారు. ఆ సమసయంలో అరెస్టైన ఫొటోలతో సీసీటీవీల్లో రికార్డైన విజువల్స్‌ను పోలీసులు కంపేర్ చేశారు. వాటి ఆధారంగా రాంజీనగర్ గ్యాంగ్ ఈ దోపిడికి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందుతుల కోసం చెన్నై, బెంగళూరుకు నాలుగు బృందాలను వెళ్లాయి.
(మే7, 2019) మధ్యాహ్నం వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు… మనీ లోడింగ్ వాహనంలో డబ్బులు తీసుకొచ్చారు సిబ్బంది. ఆ సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ఇద్దరు దుండగులు… డబ్బులు కింద పడ్డాయని చెప్పి సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. అదే సమయంలో మరో వ్యక్తి వాహనంలోని నగదు పెట్టెను ఎత్తుకుని రోడ్డు దాటాడు. అటుగా వస్తున్న ఓ ఆటోలో పెట్టి రోడ్డు దాటించారు. ఆ తర్వాత అటు వైపు మళ్లీ పెట్టెను మోసుకుంటూ పరారయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి.
