Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. 3వ డోస్ గైడ్ లైన్స్‌పై నేడు కీలక భేటీ

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ముప్పు పెరుగుతున్న వేళ.. కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్ కట్టడికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ పరిశీలిస్తోంది.

Covid Vaccination: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ముప్పు పెరుగుతున్న వేళ.. కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్ కట్టడికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ పరిశీలిస్తోంది. కాసేపట్లో.. అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం కానుంది.

కరోనా కట్టడి దిశగా.. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, వృద్ధులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అలాగే.. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి సైతం టీకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ విషయాలపై.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. 11.30 గంటలకు నిర్వహించనున్న సమావేశంలో చర్చించనున్నారు.

మరోవైపు.. 15 – 18 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం జనవరి 1 నుంచి కోవిన్ అప్లికేషన్ లో నమోదుకు అవకాశం ఇస్తున్నారు. జనవరి 3 నుంచి వీరికి కోవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది. తాజా సమావేశంలో ఈ విషయంపైనా తగిన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

Read More:

Covid Vaccines: త్వరలోనే అందుబాటులోకి మరో 2 వ్యాక్సిన్లు..!

ట్రెండింగ్ వార్తలు