Delhi Cold wave: ఢిల్లీలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Delhi Cold wave

Delhi Cold wave: ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ‘కోల్డ్ స్పెల్’ (వరుసగా కొన్ని రోజుల పాటు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

కొన్ని రోజులు 3 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో జనవరి 5 నుంచి 9 మధ్య కోల్డ్ స్పెల్ ఏర్పడిన విషయం తెలిసిందే. పదేళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండవసారి. వాయవ్యం నుంచి గాలులు వీస్తుండడంతో మరోసారి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు వాతావారణ శాఖ అధికారులు చెప్పారు.

కాగా, తెలంగాణలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. కొన్ని రోజులుగా తెల్లవారు జాము మొదలుకుని ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత సాధరణం కంటే అధికంగా ఉంటోంది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపిస్తోంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో ఎండ అధికంగా ఉంటోంది. మరోవైపు, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా ఉంది. పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Balamurugan : తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ రచయిత కన్నుమూత..