bjp anti publicity
Farmers Leaders protest: మాజీ నాయకులు బల్బీర్ సింగ్ రజేవాల్ కోల్‌కతాకు వెళ్లనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడికి వెల్లి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చూస్తానని అంటున్నారు. ఓటర్లను ఇతర పార్టీల వైపుకు మొగ్గు చూపేలా ప్రయత్నిస్తా అన్నారు.
‘ఇప్పటి వరకూ రైతు ఆందోళన చేపట్టి 105రోజులు పూర్తయింది. టీంలుగా ఏర్పడి ఐదు రాష్ట్రాల్లో ప్రయాణిస్తాం. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తిరిగి బీజేపీకి ఒక్క ఓటు కూడా పడకుండా చూస్తాం. ఈ క్రమంలోనే నేను కోల్‌కతా వెళ్తున్నా’ అని ఛండీఘడ్ లో మాట్లాడుతూ అన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా వేల మంది 100రోజులకు పైగానే ఆందోళన చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా కోల్పోయేలా ఆ చట్టాలు ఉన్నాయని రైతులు నిరసన చేపడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ యాజమాన్యం ఆధిపత్యమే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు.
కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి ఐదు ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత ఎన్నికల్లో 42కు గానూ.. 19సాధించింది ఆ పార్టీ. ఈ సారి ఎలా అయినా అధికారం దక్కించుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేపట్టారు.