Farmers protests: వారాల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు సుప్రీంలో పిటిషన్ వేసి న్యాయం కోరారు. జనవరి 11న దీనిపై విచారణ జరగనుండగా.. ఓ వ్యక్తి బోర్డర్స్ లో ఉన్న రైతులను వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. షహీన్ బాగ్ ఆందోళన గుర్తుకొస్తుందని పోల్చాడు.
శుక్రవారం ఎనిమిదో రౌండ్ సమావేశంలో రైతులతో చర్చించిన కేంద్ర మంత్రులు చట్టాలు వెనక్కు తీసుకొనేది లేదని తేల్చి చెప్పేశారు. ఇరు వైపులా మరోసారి జనవరి 15న కూర్చొని చర్చించనున్నారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. రైతు చట్టాలను వెనక్కు తీసుకొనేది లేదని చెప్పారు. ప్రభుత్వం తానుగా కోర్టుకు వెళ్లి చట్టాలని మార్పు చేయాలని కోరదని రైతు నాయకులతో చెప్పారు.
రిషబ్ శర్మ అనే పిటిషనర్ కోర్టును వెంటనే బోర్డర్ల నుంచి రైతులను తప్పించాలని కోరాడు. సింగ్, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా లాంటి బోర్డర్ పాయింట్లలో బ్లాక్ చేసిన వారిని క్లియర్ చేయడంతో పాదచారులకు ఇబ్బందిగా మారిందని అంటున్నాడు.
గతంలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన షహీన్ బాఘ్ ఆందోళనలోనూ పబ్లిక్ ప్లేస్ లలో అకారణంగా ఆక్రమణలు చేపట్టకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. ఇలా రోడ్లు బ్లాక్ చేయడమనేది సుప్రీం తీర్పును ధిక్కరించడమేనని పిటిషనర్ అంటున్నాడు. అప్పుడు యాంటీ సీఏఏ ఆందోళనకారులు రోడ్లు బ్లాక్ చేసిన సందర్బాలున్నాయి.
రైతులు ఆందోళన చేయడాన్ని కంటిన్యూ చేసి పబ్లిక్ రోడ్లు బ్లాక్ చేయడానికి అనుమతిస్తే.. అది కేవలం కోర్టు తీర్పును ధిక్కరించడమే కాకుండా.. సాధారణ వ్యక్తులకు కూడా ఇబ్బందికి గురి చేస్తున్నట్లేనని అన్నాడు. ఈ మేరకు నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ సరిహద్దుల్ని క్లియర్ చేయాలని అపెక్స్ కోర్టు ఆదేశాలివ్వాలంటూ అడుగుతున్నాడు.