Sanjay Raut: 2023లోనూ రాహుల్ ప్రభ ఇలాగే కొనసాగితే 2024లో రాజకీయ మార్పు: సంజయ్ రౌత్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి 2022 కొత్త వెలుగుని ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. అదే ప్రభ 2023లోనూ కొనసాగితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూస్తుందని చెప్పారు. ‘సామ్నా’ దినపత్రికలో ఆయన ఓ కథనాన్ని రాసుకొచ్చారు.

Sanjay Raut: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి 2022 కొత్త వెలుగుని ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. అదే ప్రభ 2023లోనూ కొనసాగితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూస్తుందని చెప్పారు. ‘సామ్నా’ దినపత్రికలో ఆయన ఓ కథనాన్ని రాసుకొచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా విద్వేషం, విభజన వాదాలను వ్యాప్తి చేయకూడదని ఆయన అన్నారు. అలాగే, అయోధ్యలో రామాలయం అంశానికి ఇప్పటికే పరిష్కారం దొరికిందని, ఇక ఆ విషయాన్ని వాడుకుంటూ ఓట్లు అడగకూడదని చెప్పారు. ఇప్పుడు మరో కోణంలో ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటున్నారని, కొత్త ‘లవ్ జిహాద్’ను తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు.

హిందువుల్లో భయాన్ని నింపి ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. 2023లో దేశం భయరహిత దేశంగా మారుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆయా రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.

Ravela Kishore Babu : గులాబీ గూటికి ఏపీ నేతలు.. బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్న రావెల, తోట

ట్రెండింగ్ వార్తలు