Divorce At 75: 39 ఏళ్ల భర్త నుంచి విడాకులు తీసుకున్న 75 ఏళ్ల భార్య.. భరణం ఎంతో తెలుసా
Divorce At 75 : కాటికి కాళ్లు చాపిన వయసులో ఇద్దరు మహిళలు తమ భర్తల వద్ద నుంచి విడాకులతో పాటు భరణం కూడా పొందుతున్నారు.
- Dharani Pilli
- Published On : March 31, 2026 / 11:16 AM IST
in himachal pradesh two 75 year old women divorce their husbands aged 59 and 39
- 75 ఏళ్ల వయసులో భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు
- హిమాచల్ ప్రదేశ్ లో వెలుగు చూసిన సంఘటన
- భరణం రూ.5వేలు
Divorce At 75: ఒకప్పుడు విడాకులు తీసుకోవాలంటే.. చాలా ఆలోచించేవారు. తల్లిదండ్రులు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే.. కలిసే ఉండాలని సూచించేవారు. కానీ నేటి కాలంలో విడాకులు సర్వసాధారణం అయ్యాయి. భార్యాభర్తలిద్దరిలో ఎవరికి ఏమాత్రం నచ్చకపోయినా.. వెంటనే విడాకుల బాట పడుతున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు ఆడవాళ్లు.. కేవలం భరణం కోసమే విడాకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. 75 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు.. తమ భర్తలకు విడాకులు ఇచ్చి భరణం పొందారు. ఆ వయసులో విడాకులు తీసుకోవడమే సంచలనం అంటే.. ఇక ఆ ఇద్దరు మహిళల భర్తల వయసు ఒకరిది 59 అయితే, మరొకరిది 39 ఏళ్లు. ఈ వింత కథనం వివరాలు..
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ ఆసక్తికర విడాకుల కేసులు వెలుగుచూశాయి. మొదటి కేసులో మహిళ వయసు 75 సంవత్సరాలు కాగా.. ఆమె భర్త వయసు 59 ఏళ్లు. ఈ జంటకు 36 సంవత్సరాల క్రితం అనగా.. 1990లో వివాహం జరిగింది. అయితే వీరికి సంతానం లేదు. పైగా చాలా సంవత్సరాల నుంచి వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత 16 ఏళ్లుగా అంటే 2010 నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. దంపతుల మధ్య సయోధ్య కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. దీంతో చివరకు వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు పొందారు. ఈ కేసులో ఆమెకు ప్రతి నెలా రూ. 5 వేల భరణంతో పాటు గృహవసతి, వైద్య ఖర్చులు భరించేందుకు భర్త అంగీకరించారు.
రెండో కేసులో.. 39 ఏళ్ల భర్త నుంచి 75 సంవత్సరాల వయసున్న మహిళ విడిపోయారు. వీరిద్దరూ 2008లో వివాహం చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో గత ఐదేళ్ల నుంచి అనగా 2021 నుంచి ఈ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వీరు కలిసి ఉండి నిత్యం వాదులాడుకునే బదులు.. సామరస్యంగా విడిపోతే మంచిదని నిర్ణయించుకున్నారు. అయితే ముగ్గురు పిల్లలు వారి తండ్రితోనే నివసించేందుకు అంగీకరించారు. అలానే పిల్లలను వారి తల్లితో కలిసేందుకు అనుమతిస్తానని కోర్టుకు భర్త హామీ ఇచ్చారు. దీంతో వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాటికి కాళ్లు చాపిన వయసులో.. ఈ మహిళలు విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.
