Power Consumption: ఇండియాలో కరెంటు వినియోగం.. ఒక్క డిసెంబర్ నెలలోనే భారీగా పెరిగిందట. 6.1 శాతం పెరగడంతో.. 107.3 బిలియన్ యూనిట్స్‌కు చేరింది. అఫీషియల్ డేటా ప్రకారం.. ఎకనామిక్ యాక్టివిటీలు పెరిగాయట. గతేడాది డిసెంబరులో కేవలం 101.08 బిలియన్ యూనిట్లుగానే ఉంది.
ఆరు నెలల గ్యాప్ తర్వాత సంవత్సరంలో పెరిగేంతటి నెంబర్లు నమోదయ్యాయి. సెప్టెంబర్ 4.5శాతం, అక్టోబరులో 11.6శాతంగా ఉన్నాయి.
నవంబరులో కరెంటు వినియోగం కాస్త స్తో అయింది. 3.12శాతమే పెరిగి 96.88 బిలియన్ యూనిట్లుగా ఉంది. అదే గతేడాది నవంబరు కరెంట్ వినియోగం 93.94 మాత్రమే నమోదైంది.
నిపుణుల చెప్తున్న దానిని బట్టి కరెంటు వినియోగం ఎన్నడూ లేనంతగా అంటే 6.1శాతం పెరిగి ఆల్ టైం హై పీక్ పవర్ డిమాండ్ 182.88గిగా వాట్స్ కు చేరిందట. దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిందనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం అని చెబుతున్నారు. రాబోయే నెలల్లో కరెంటు వినియోగం అనేది స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు.
గత వారం పవర్ సెక్రటరీ ఎస్ఎన్ సహాయ్ ట్వీట్ చేస్తూ.. ‘పవర్ కోసం ఆల్ ఇండియా డిమాండ్ లక్షా 82వేల 888 మెగా వాట్స్ కు చేరింది. గతంలో 2019 మే 30న మాత్రమే నమోదైన లక్షా 82వేల 610మెగా వాట్ల వినియోగాన్ని దాటేసిందని రికార్డులు చెబుతున్నాయి.
ప్రభుత్వం మార్చి 25నుంచి జాతీయవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దాంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోగా కరెంటు వినియోగం అనేది తగ్గుముఖం పట్టింది. మార్చి నుంచి ఆగష్టు వరకూ ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. అదే మార్చిలో 8.7శాతం, ఏప్రిల్‌లో 23.2 శాతం, మేలో 14.9శాతం, జూన్ నెలలో 10.9శాతం, జులైలో 3.7శాతంలతో పాటు ఆగష్టులో 1.7శాతం తగ్గిపోయాయి.
ఏప్రిల్ 20 తర్వాత నుంచి నిబంధనలు సడలించడంతో కాస్త ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది.