IRCTC: ఐఆర్సీటీసీ మరోసారి ఈ క్యాటరింగ్ సర్వీసులకు ఓకే చెప్పింది. కొవిడ్-19 దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీనిపై మరోసారి చర్చించిన ఈస్టరన్ రైల్వే ఆదివారం తమ సర్వీసులను పునరుద్దరించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు హౌరా, సీల్దా, కోల్‌కతా, దుర్గాపూర్, అసన్సోల్, మల్దా, భగల్‌పూర్ స్టేషన్లలో ఫుడ్ సప్లై చేయనుంది.
ఇంకా బర్‌ద్ధామన్, బోల్‌పూర్, జమల్‌పూర్ స్టేషన్లను కూడా యాడ్ చేయాలనుకుంటున్నారు. ప్రత్యేక ట్రైన్లలో సుదూర ప్రయాణాలు చేసేవారు వేడిగా, ఆరోగ్యకరమైన, హైజెనిక్ ఫుడ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నామినేట్ అయిన వెండర్ల నుంచి సర్వీస్ రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఐఆర్సీటీసీ చెప్పింది.
సెలక్ట్ చేసిన స్టేషన్లలో సర్వీసులు మొదలుపెట్టాలని ఐఆర్సీటీసీ ప్లాన్ చేస్తున్నట్లు రైల్వే బోర్డు చెప్పింది. అది కూడా కొవిడ్ ప్రొటోకాల్స్ ఫాలో అవుతూనే చేయనున్నారట. ఈ క్యాటరింగ్ సర్వీసు మాత్రమే కాకుండా సెలక్టెట్ స్టేషన్లలో అవుట్‌లెట్స్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.