Joe Root: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. శుక్రవారం అరుదైన ఘనత నమోదు చేశాడు. తాను ఆడిన 100వ టెస్టులోనూ సెంచరీ నమోదు చేసి ఆ జాబితాలో 9వ వాడిగా నిలిచాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఘనత నమోదైంది.
రూట్ తన 20వ సెంచరీని 164బంతుల్లో 12 బౌండరీల సాయంతో పూర్తి చేయగలిగాడు. ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత ఉంది. తన తొలి టెస్టును, వందో టెస్టును ఒకే జట్టుతో ఆడిన క్రికెటర్లలో రూట్ మూడో వ్యక్తి. రూట్ నాగ్ పూర్ వేదికగా జరిగిన సిరీస్ లో అరంగ్రేటం చేశాడు. ఆ సిరీస్ ను ఇంగ్లాండ్ 2-1తేడాతో గెలిచింది. ఇండియాతో ఆడిన 17మ్యాచ్ లలో ఇది ఐదో సెంచరీ.
వెస్ట్ ఇండీస్ కార్ల్ హూపర్, ఇండియా కపిల్ దేవ్ లు మాత్రమే టెస్టు అరంగ్రేటం, వందో మ్యాచ్ లు ఒకే జట్టుతో ఆడగలిగారు. కపిల్ 1978లో తొలి టెస్టు ఆడగా.. వందో టెస్టు 1989లో పాకిస్తాన్ తోనే ఆడాడు. హూపర్ ఇండియాతోనే 1987లో మళ్లీ 2002లో మొదటి, వందో టెస్టులు ఆడగలిగాడు.
ఇంతకంటే ముందు వందో టెస్టులో సెంచరీ చేసిన ప్లేయర్ల వివరాలు:
కొలిన్ కౌడ్రే (104 వర్సెస్ ఆస్ట్రేలియా 1968)
జావేద్ మియాందాద్ (145 వర్సెస్ ఇండియా 1969)
గార్డన్ గ్రీనిడ్జ్ (149 వర్సెస్ ఇంగ్లాండ్ 1990)
అలెక్ స్టీవర్ట్ (105 వర్సెస్ వెస్టిండీస్ 2000)
ఇంజమామ్ ఉల్ హక్ (184 వర్సెస్ ఇండియా 2004)
రిక్కీ పాంటింగ్ (120 & 143 వర్సెస్ సౌతాఫ్రికా 2006)
గ్రేమ్ స్మిత్ (131 వర్సెస్ ఇంగ్లాండ్ 2012)
హషీమ్ ఆమ్లా (134 వర్సెస్ శ్రీలంక 2017)