Kharge writes to Amit Shah: ఎల్లుండి శ్రీనగర్ లో రాహుల్ సభ.. భద్రతా వైఫల్యంపై అమిత్ షాకు ఖర్గే లేఖ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాసి, కశ్మీర్ లో భారత్ జోడో యాత్ర నేపథ్యంలో భద్రతపై జోక్యం చేసుకోవాలని కోరారు. భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు ఖర్గే లేఖలో చెప్పారు. ఈ నేపథ్యంలో సరైన భద్రత కల్పించాలని కోరారు.
- T Venkateshwarlu
- Published On : January 28, 2023 / 10:57 AM IST
Bharat Jodo Yatra
Kharge writes to Amit Shah: జమ్మూకశ్మీర్ లో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విషయంలో భద్రతా వైఫల్యం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న కశ్మీర్ లోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించిన నేపథ్యంలో మరోనసారి భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడడం, యాత్రకు కొద్దిసేపటి పాటు బ్రేక్ ఇవ్వడం కలకలం రేపాయి.
దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాసి, కశ్మీర్ లో భారత్ జోడో యాత్ర నేపథ్యంలో భద్రతపై జోక్యం చేసుకోవాలని కోరారు. భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు ఖర్గే లేఖలో చెప్పారు. ఈ నేపథ్యంలో సరైన భద్రత కల్పించాలని కోరారు.
అలాగే, ఎల్లుండి శ్రీనగర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి చాలా మంది కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల ముఖ్యనేతలు హాజరు అవుతారని, సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. భద్రత విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు. నిన్న భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడంతో తాను ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. కాగా, కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శ్రీనగర్ సభలో ముగియనుంది.
