మిస్ ఇండియా 2020: సాయంత్రం గిన్నెలు తోమి.. రాత్రుళ్లు కాల్ సెంటర్‌కు వెళ్లి

Miss India 2020 Manya Singh: తెలంగాణలో ఇంజినీర్ అయిన మానస వారణాసిని వీఎల్‌సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 విన్నర్‌గా బుధవారం రాత్రి ప్రకటించారు. ఆమెతో పాటు వీఎల్‌సీసీ ఫెమీనా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానిక షికాండ్‌కు, మాన్యా సింగ్‌కు రన్నరప్ కిరీటాలు అలకరించారు. ఈ స్థాయికి రావడానికి మాన్యా ఎన్ని కష్టాలు పడ్డారో.. అసలు ఆమె ఎవరో.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసా..

ఉత్తరప్రదేశ్ లోని ఆటో డ్రైవర్ కూతురు మాన్యా.. ఎన్నో నిద్రలేని రాత్రులు, సంవత్సరాల తరబడి చేసిన కఠిన శ్రమకు తియ్యని ప్రతిఫలం దక్కింది. ఈ సక్సెస్ సాధించడానికి.. ఆమె పడ్డ కష్టాలను మాన్య ఇన్నేళ్లకు బయటపెట్టారు. మిస్ ఇండియా అనిపించుకున్న తర్వాత ఆమె జర్నీ గురించి ముఖ్య విశేషాలు చెబుతున్నారు.

రక్తం.. చెమట ధారపోసి:

‘నా రక్తం, చెమట, కన్నీళ్లు అన్నీ కలగలిపి ధైర్యంగా నూరిపోసుకుని కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడ్డా. అని డిసెంబరులో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. .

ఐదు రూపాయల కోసం మైళ్ల దూరం:

ఖుషీనగర్ లో పుట్టిన మాన్యా.. చాలా కఠినమైన పరిస్థితుల్లో పెరిగారు. కొన్ని రాత్రుళ్లు తిండిలేక నిద్రకూడా పట్టేది కాదట. ఐదు రూపాయలు దాచి పెట్టుకోవడం కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. ఆ డబ్బులు దాచుకుని పుస్తకాలు, బట్టలు కొనుక్కునేవారట. అదృష్టం ప్రతిసారి ప్రశ్నించి దూరంగా వెళ్లిపోయేదట. ఈవిడ పరీక్ష ఫీజు కట్టడం కోసం ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారాన్ని కూడా అమ్మేశారట.

చదువు అనేది విలువైన ఆయుధం:

ఆమె ఎప్పుడూ చెప్తుంటారు. చదువు అనేది చాలా విలువైన ఆయుధం అని. అంటూ మిస్ ఇండియా ఆమెపై ఒక పోస్టులో పేర్కొన్నారు.

ఆటోడ్రైవర్ కూతురు అని చెప్పి క్లాస్‌మేట్స్ దూరంగా:

హెచ్ఎస్సీ చదువుతున్న సమయంలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు గెలుచుకున్న ఆమె.. ఈ అవార్డు గెలుచుకోక ముందు రోజు వరకూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఇక పుస్తకాలు కొనడం కోసం మరింత ఇబ్బంది అయ్యేది. ఆటోడ్రైవర్ కూతురు అని చెప్పి ఆమె క్లాస్ మేట్స్ కూడా నిర్లక్ష్యపెట్టేసేవారు.

సాయంత్రం గిన్నెలు తోమి రాత్రుళ్లు కాల్‌సెంటర్‌కు వెళ్లి:

కాలేజికి వెళ్లి సాయంత్రం సమయంలో గిన్నెలు తోమి.. రాత్రుళ్లు కాల్ సెంటర్లో పనిచేసేదట. ఆటో డబ్బులు మిగుల్చుకోవడం కోసం చాలా దూరం నడిచివెళ్లేదానినని చెప్తుంది. ఇవాళ వీఎల్‌సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 స్టేజి మీద నిల్చున్నా. నా తండ్రీ, తల్లిని, నా తమ్ముడిని ప్రపంచానికి పరిచయం కలుగుతున్నా. మీ కలలను సాకారం చేసుకోవాలని బలంగా నమ్మితే ఏ విషయమైనా సాధ్యం కాకుండా ఉండదని మాన్యా సింగ్ చెప్తుంది.

మిస్ ఇండియా పోటీని ఆర్గనైజ్ చేసిన ఫెమీనా.. ఉమెన్స్ మ్యాగజైన్ ను ద టైమ్స్ గ్రూప్ పబ్లిష్ చేసింది. ఈ పోటీలో ముగ్గురు విన్నర్లను ప్రకటించారు నిర్వహకులు. ప్రస్తుతం మాన్యా సింగ్ మేనేజ్మెంట్ స్టడీస్ చదవడం కోసం ప్రిపేర్ అవుతున్నారు.