Rajanna Sirisilla District
Rajanna Sirisilla District: ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేక తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపల్లిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే ఉరి వేసుకున్నారు.
చెక్కపల్లి గ్రామంలో నివసించే కనకయ్య అనే వ్యక్తికి, ఆయన భార్యకు మధ్య విభేదాలు వచ్చాయి. కనకయ్య భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తిరిగి తన వద్దకు రావడం లేదని కనకయ్య మనస్తాపం చెందాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఈ విషయాన్ని గమనించిన అతడి తల్లి.. కుమారుడు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
వెంటనే అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ఊరిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లీకుమారుల ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఊరికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను రాబట్టేందుకు తదుపరి విచారణ జరుపుతున్నారు.
Watch viral video: యువతికి గుండు చేశాక భావోద్వేగంతో తానూ గుండు చేసుకున్న క్షౌరకుడు