tractor-rally-delhi
Anti Farm Law: రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు ముంబై నుంచి నాసిక్ రైతులు బయల్దేరనున్నారు. శనివారం ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్)ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీ కోసం ముంబై నుంచి బయల్దేరారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 23నుంచి 26వరకూ జరగాల్సిన ర్యాలీలో ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రైతులు పాల్గొనేలా ఉన్నారు.
ఆజాద్ మైదాన్ లో జనవరి 24నుంచి ఆందోళనలో పాల్గొని జనవరి 25న రాజ్ భవన్ వరకూ భారీ ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం అందజేయనున్నారు. ఆజాద్ మైదానంలో జనవరి 26న రిపబ్లిక్ డే జెండా వందనం ఎగరనుంది.
కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా చేపడుతున్న ఆందోళనకు కేంద్రం కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని.. ఏఐకేఎస్ నేషనల్ ప్రెసిడెంట్ డా.అశోక్ ధావలె అన్నారు. జనవరి 25న జరిగే ర్యాలీలో రైతు సంఘాలు, మహా వికాస్ అఘాడీ, నేషనల్ ప్రెసిడెంట్ శరద్ పవార్, కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ రెవెన్యూ మినిష్టర్ బాలా సాహెబ్ థోరట్, శివసేన లీడర్, స్టేట్ ఎన్విరాన్మెంట్ అండ్ టూరిజం మినిష్టర్ ఆదిత్య ఠాకరే, డెమోక్రటిక్ పార్టీల లీడర్లు మీటింగ్ కు హాజరుకానున్నారు.