Viral Video: మరోసారి పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా వీడియో వైరల్

భారతీయ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18)కు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సారి ఆయేషా హర్యాన్వి పాటకు పెదవులు కదిలిస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో మరోసారి ఆమె సోషల్ మీడియా యూజర్లను తన వైపునకు ఆకర్షించింది.

Viral Video

Viral Video: భారతీయ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18)కు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సారి ఆయేషా హర్యాన్వి పాటకు పెదవులు కదిలిస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో మరోసారి ఆమె సోషల్ మీడియా యూజర్లను తన వైపునకు ఆకర్షించింది.

సామాజిక మాధ్యమాల్లో ఆయేషా ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ‘మేరా దిల్ యే పుకారే ఆజా’కు ఆమె కొన్ని వారాల క్రితం డ్యాన్స్ చేయడంతో బాగా పాపులర్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ‘బటియన్ బుజాయ్ రఖ్దీ’ అనే పాటకు ఆమె డ్యాన్స్ చేసి, మరోసారి అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు హర్యాన్వి పాటతో నెటిజన్ల ముందుకు వచ్చింది.

సామాజిక మాధ్యమాల ప్రభావంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన వారి జాబితాలో తాజాగా ఆయేషా కూడా చేరింది. పాక్ లో అమ్మాయిలపై ఉండే ఆంక్షల వంటి వాటిని ఎదిరించి ఆమె డ్యాన్సులు చేస్తోంది. దుస్తులు, కట్టుబాట్ల విషయంలో ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఆయేషా తన పనితాను చేసుకుపోతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు వారాల వ్యవధిలోనే లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చి చేరారు.

Jesus Statue Vandalise: కర్ణాటకలో మరో వివాదం.. క్రిస్మస్ జరిగిన మర్నాడే జీసెస్ విగ్రహాం ధ్వంసం