Jesus Statue Vandalise: కర్ణాటకలో మరో వివాదం.. క్రిస్మస్ జరిగిన మర్నాడే జీసెస్ విగ్రహాం ధ్వంసం

బలిపీఠం వద్ద ఉంచిన ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే చర్చిలోని జీసస్ ప్రధాన విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చర్చి పాస్టర్ లేని సమయంలో ఈ విధ్వంసం జరిగిందట. విగ్రహ ధ్వంసంతో పాటు విరాళం పెట్టెలోని డబ్బు కూడా కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు.

Jesus Statue Vandalise: కర్ణాటకలో మరో వివాదం.. క్రిస్మస్ జరిగిన మర్నాడే జీసెస్ విగ్రహాం ధ్వంసం

Miscreants vandalise statue of Jesus in Mysuru days after Christmas

Updated On : December 28, 2022 / 4:44 PM IST

Jesus Statue Vandalise: కర్ణాటక రాష్ట్రంలో మతాల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఎప్పుడు ఏదో అలికిడి, ఎక్కడో ఏదో ఘటన.. ఒక వివాదం ముగుస్తుందో లేదో మరొకటి ప్రారంభమవుతోంది. కొద్ది రోజులుగా హిందూ, ముస్లింల మధ్య అనేకసార్లు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అప్పుడప్పుడు క్రైస్తవ మతం విషయంలో కూడా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన మరొక ఘటన రాష్ట్రంలో మరోసారి ప్రకంనపలు రేపనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Uma Bharti: మీకు స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా ఓటేయొచ్చు.. పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్‭తో ఉమా భారతి వ్యాఖ్యలు, కలవరంలో బీజేపీ

మైసూరులోని ఒక చర్చీలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. క్రిస్మస్ జరిగిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం. మంగళవారం సాయంత్రం మైసూరు జిల్లాలోని పెరియపట్న పట్టణంలో ఉన్న చర్చీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలిపీఠం వద్ద ఉంచిన ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే చర్చిలోని జీసస్ ప్రధాన విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చర్చి పాస్టర్ లేని సమయంలో ఈ విధ్వంసం జరిగిందట. విగ్రహ ధ్వంసంతో పాటు విరాళం పెట్టెలోని డబ్బు కూడా కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు.

Yatra Breach: రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. భద్రత కల్పించాలంటూ అమిత్ షాకు లేఖ

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు విచారణ ప్రారంభించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై మైసూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీమా లత్కర్ మాట్లాడుతూ “నిందితులను పట్టుకోవడానికి మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేసాము. చర్చి సమీపంలోని కెమెరాలతో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాము. విరాళం పెట్టెలోని డబ్బుతో పాటు చర్చిలోని ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. తదుపరి విచారణ కొనసాగుతోంది” అని అన్నారు.