Yatra Breach: రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. భద్రత కల్పించాలంటూ అమిత్ షాకు లేఖ

ఇంటెలీజెన్స్ బ్యూరోకు చెందిన వారు యాత్రలో పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై హర్యానాలోని గుర్గావ్‌లో పార్టీ దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదును వేణుగోపాలు ఉదహరించారు. "హర్యానా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తు తెలియని దుండగులు భారత్ జోడో యాత్ర కంటైనర్‌లలోకి అక్రమంగా ప్రవేశించారు’’ అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

Yatra Breach: రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. భద్రత కల్పించాలంటూ అమిత్ షాకు లేఖ

Congress Alleges Yatra Breach, Writes To Centre For Rahul Gandhi's Safety

Yatra Breach: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా పలు భద్రతా లోపాలు ఉన్నాయని, యాత్రా అధినేత రాహుల్ గాంధీకి రక్షణ కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయమై బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పార్టీ లేఖ రాసింది. ఈ భద్రతా లోపాన్ని కాంగ్రెస్ ‘యాత్రా బ్రీచ్’గా వ్యాఖ్యానించింది. యాత్ర శనివారం ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత భద్రతలో పలుమార్లు ఉల్లంఘనలు కనిపించాయని హోంమంత్రికి రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

Pak PM Shehbaz Sharif : ‘భోజనం పెడతారు కూర్చోండి కూర్చోండి’ తన ప్రసంగాన్ని అడ్డుకున్నవారిని సముదాయించిన పాక్ ప్రధాని

‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు’’ అని లేఖలో ఆరోపించారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణించే మార్గంతో పాటు యాత్రకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాల్సిందని చెప్పారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Covid Drugs: చైనాలో మన మందులకు పెరిగిన డిమాండ్.. బ్లాక్‌లో కొంటున్న చైనీయులు

ఇంటెలీజెన్స్ బ్యూరోకు చెందిన వారు యాత్రలో పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై హర్యానాలోని గుర్గావ్‌లో పార్టీ దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదును వేణుగోపాలు ఉదహరించారు. “హర్యానా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తు తెలియని దుండగులు భారత్ జోడో యాత్ర కంటైనర్‌లలోకి అక్రమంగా ప్రవేశించారు’’ అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

Heeraben Modi: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

‘‘భారత భూభాగం అంతటా తిరిగేందుకు ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కు ఉంది. భారత్ జోడో యాత్ర దేశంలో శాంతి, సామరస్యాన్ని తీసుకురావడానికి జరుగుతోంది. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడకూడదు, కాంగ్రెస్ నాయకుల భద్రతకు హామీ ఇవ్వాలి” అని లేఖలో వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశ సమైక్యత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సహా అనేక మంది కాంగ్రెస్ నాయకులు చేసిన త్యాగాలను ప్రస్తావించారు. యాత్ర పంజాబ్‭లోకి ప్రవేశించి, జమ్మూ కాశ్మీర్‌లోకి వెళ్లనున్న సందర్భంగా రాహుల్ గాంధీకి మెరుగైన భద్రతను పార్టీ కోరింది.